కూతుళ్లే.. | - | Sakshi
Sakshi News home page

కూతుళ్లే..

Sep 27 2026 2:15 PM | Updated on Sep 27 2026 2:15 PM

మా ఇంటి దివ్వెలు
కూలీ పనులు చేస్తూ.. ఉన్నతంగా చదివిస్తూ ఆదర్శంగా సురేందర్‌రెడ్డి దంపతులు

కంగ్టి(నారాయణఖేడ్‌): తల్లిదండ్రులిద్దరూ నిరక్షరాస్యులు. అయినా వారు చదువు వి లువ తెలుసుకున్నారు. కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా పట్టించుకోకుండా పిల్లలను ఉన్నత చదువులు చదివించారు. కంగ్టి మండలం బాన్సువాడ గ్రామానికి చెందిన జార సురేందర్‌రెడ్డి– సుజాత దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కూతురు దీపిక ఇటీవల బీఎడ్‌ పూర్తి చేసి టెట్‌ కోసం కోచింగ్‌ తీసుకుంటుండగా.. చిన్న కూతురు వర్దిని బీటెక్‌ కంప్యూటర్స్‌లో సైబర్‌ సెక్యూరిటీ పూర్తి చేసి ఇంటర్న్‌షిప్‌తో పాటు కోడింగ్‌, జావా, ఫైథాన్‌ వంటి అనుబంద కోర్సులు నేర్చుకుంటోంది. సెలవు రోజుల్లో ఇంటికి వచ్చిన సమయంలో ఇద్దరూ తల్లిదండ్రులకు వ్యవసాయ పనుల్లో సాయం చేస్తున్నారు. ఈసందర్భంగా సురేందర్‌రెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ.. తమ పిల్లలను మగవారితో సమానంగా పెంచి.. పల్లెటూరి నుంచి పట్టణాలకు పంపి ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దిన తృప్తి తనకు దక్కిందంటున్నారు. గ్రామంలో వ్యవసాయ కూలీగా పని చేస్తూ తమ పిల్లలను హాస్టల్‌లో ఉంచి మంచి విద్యను అందించినట్లు తెలిపారు. వారే మీ జీవనాధారం అని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement