అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట

Sep 27 2026 2:15 PM | Updated on Sep 27 2026 2:15 PM

నారాయణఖేడ్‌: అభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని జహీరాబాద్‌ ఎంపీ సురేశ్‌ షెట్కార్‌, ఖేడ్‌ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. పట్టణంలోని బాల సదనంలో మైనార్టీ మహిళలు 200 మందికి కుట్టు మిషన్లను శనివారం పంపిణీ చేశారు. అనంతరం అనంతసాగర్‌లో రూ.50 లక్షలతో నిర్మించనున్న సంగమేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసి పలు ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. రుద్రారం, బండ్రాన్‌పల్లి, చందాపూర్‌, లింగాపూర్‌ గ్రామాల లబ్ధిదారులకు స్మార్ట్‌ రేషన్‌ కార్డులను అందజేశారు. అలాగే కల్యా ణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు, సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను పంపిణీ చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామాలు, తండాల్లో మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. అర్హులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఆత్మ కమిటీ చెర్మన్‌ వినోద్‌ పాటిల్‌, మున్సిపల్‌ చైర్మన్‌ నగేశ్‌ షెట్కార్‌, నాయకులు రమేశ్‌ చౌహాన్‌, పండరిరెడ్డి, ముంతాజ్‌, తాహెర్‌, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, డివిజన్‌ పరిధిలోని అధికారులు పాల్గొన్నారు.

ఎంపీ సురేశ్‌ షెట్కార్‌, ఎమ్మెల్యే సంజీవరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement