వీరనారి చాకలి ఐలమ్మ | - | Sakshi
Sakshi News home page

వీరనారి చాకలి ఐలమ్మ

Sep 27 2026 2:15 PM | Updated on Sep 27 2026 2:15 PM

వీరనారి చాకలి ఐలమ్మ బాల్య వివాహాలను నిర్మూలిద్దాం జహీరాబాద్‌ ఏడీఏగా వైద్యనాథ్‌ ‘సామాజిక బాధ్యతలో ముందుండాలి’

సంగారెడ్డి జోన్‌: వీరనారి చాకలి ఐలమ్మ చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడుచుకొని ఆమె ఆశయ సాధనకు కృషి చేయాలని కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ పిలుపునిచ్చారు. శనివారం జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆమె జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా పట్టణంలోని ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ సైతం నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అంజయ్య, బీసీ సంక్షేమ అధికారి జగదీశ్‌ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా సంక్షేమ అధికారిణి లలిత కుమారి

సంగారెడ్డి జోన్‌: బాల్య వివాహాల నిర్మూలనకు మత పెద్దలు తమవంతు సహకారం అందించాలని జిల్లా సంక్షేమ అధికారిణి లలిత కుమారి కోరారు. శనివారం పట్టణంలోని బాల్య వివాహ నిషేధ చట్టం–2006పై పూజా రులు, పాస్టర్లు, ముస్లిం మత పెద్దలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 18 సంవత్సరాల లోపు బాలికలకు, 21 సంవత్సరాల లోపు బాలురకు వివాహాలు నిర్వహిస్తే సంబంధిత మత పెద్దలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వివాహాలు నిర్వహించే సమయంలో వారి పుట్టిన తేదీలను తప్పనిసరిగా పరిశీలించాలన్నారు. అన్ని మతాల మత పెద్దల సహకారంతో జిల్లాను బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసకుంటామన్నారు. బాల్య వివాహాలకు పాల్పడితే చట్టపరంగా శిక్షలు ఉంటాయన్నారు. రూ.1 లక్ష వరకు జరిమానాతో పాటు రెండేళ్ల వరకు కారాగార శిక్ష విధించే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో బాలల సంక్షేమ సమితి చైర్మన్‌ రాజారెడ్డి, డీసీఆర్‌బీ సీఐ రమేశ్‌, జిల్లా బాలల పరిరక్షణ అధికారి రత్నం, సభ్యులు వెంకటేశం, విష్ణుమూర్తి, చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ కోఆర్డినేటర్‌ యాదగిరి, డీసీపీయూ సిబ్బంది లింగం తదితరులు పాల్గొన్నారు.

జహీరాబాద్‌ టౌన్‌: జహీరాబాద్‌ డివిజన్‌ సహాయ వ్యవసాయ సంచాలకుడి(ఏడీఏ)గా డాక్టర్‌ వైద్యనాథ్‌ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఏడీఏగా ఉన్న భిక్షపతి బదిలీపై వెళ్లడంతో ఆయన స్థానంలో వైద్యనాథ్‌ బదిలీపై ఇక్కడికి వచ్చారు. నెల రోజులుగా ఏడీఏ పోస్టు ఖాళీగా ఉన్నందున వ్యవసాయ శాఖ ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, క్షేత్రస్థాయి కార్యక్రమాల పర్యవేక్షణ నిలిచిపోయింది. ఉద్యోగుల జీతభత్యాల బిల్లులతో పాటు పలు రకాల ఆర్థికపరమైన ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో రైతులు, ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయమై ఈనెల 21న ‘సాక్షి’లో ‘ఏడీఏ వస్తారా.. రారా!’ అనే శిర్షీకన ప్రచురితమైన కథనానికి జిల్లా అధికారులు స్పందించారు. ఈ మేరకు సదాశివపేట విత్తనక్షేత్రం సహాయ సంచాలకుడిగా వైద్యనాథ్‌ను ఏడీఏగా నియమించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జహీరాబాద్‌ రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ తన వంతుగా సేవలను అందిస్తానని తెలిపారు. వ్యవసాయ, విస్తరణ అధికారులు ఏడీఏను సన్మానించారు.

సంగారెడ్డి టౌన్‌: విద్యార్థులు సామాజిక బాధ్యతలో ముందుండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవాని చంద్ర అన్నారు. శనివారం సంగారెడ్డిలోని లా కాలేజీలో లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌ను ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు న్యాయవిద్యను అభ్యసించడమే కాకుండా సమాజంలో అవసరమైన వారందరికీ బాధ్యతతో పనిచేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాలలో న్యాయ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్రజలకు వారి హక్కులు బాధ్యతలపై అవసరమైన పద్ధతిలో తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement