పార్టీని బలోపేతం చేయండి | - | Sakshi
Sakshi News home page

పార్టీని బలోపేతం చేయండి

Sep 26 2026 7:41 AM | Updated on Sep 26 2026 7:41 AM

పార్టీని బలోపేతం చేయండి పాత భవనం కూల్చివేయరూ?

నారాయణఖేడ్‌: కాంగ్రెస్‌ను సంగారెడ్డి జిల్లాలో క్షేత్రస్థాయి నుంచి పటిష్ట పర్చాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, ఏఐసీసీ పరిశీలకుడు మొయప్పన్‌ నూతనంగా నియమితులైన డీసీసీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డికి సూచించారు. శుక్రవారం ఖేడ్‌ ఎమ్మెల్యే సంజీవరెడ్డితో కలిసి నూతనంగా చంద్రశేఖర్‌రెడ్డి హైదరాబాద్‌లో వారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాలోని కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలను సమన్వయ పరుస్తూ పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు. జిల్లా అభివృద్ధికి, పార్టీ పటిష్టతకు తమ వంతుగా సహకరం అందిస్తామని భరోసా ఇచ్చారు.

సాగుకు ప్రణాళికలు రూపొందించాలి

డీఏఓ శివప్రసాద్‌

సంగారెడ్డి జోన్‌: వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రబీ సీజన్‌లో పంటల సాగుకు ప్రణాళికలు రూపొందించాలని జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని వ్యవసాయశాఖ కార్యాలయంలో రబీలో పంటల సాగుపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్‌నినో నేపథ్యంలో రాబోయే సీజన్‌ సాగు చేసే పంటలను అంచనా వేయాలన్నారు. వాటికి అనుగుణంగా అవసరమయ్యే విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. రైతులకు శాసీ్త్రయ సాంకేతిక సలహాలు అందించడం, పంటల ఎంపికలో తగిన సూచనలు చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్‌ వసంత కుమారి, జిల్లా నీటిపారుదల శాఖ అధికారి జగన్నాథం, కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ వరప్రసాద్‌, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్‌ అరుణ తదితరులు పాల్గొన్నారు.

హత్నూర(సంగారెడ్డి): దశాబ్దాల క్రితం నిర్మించిన దౌల్తాబాద్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శిథిలావస్థకు చేరడంతో నూతన భవనం నిర్మించారు. దానిని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించారు. పాత భవనాన్ని వెంటనే కూల్చివేయాలని ఆదేశించారు. ఏడాదైనా దానిని కూల్చివేయకపోవడంతో పాములు, క్రిమి కీటకాలు చేరి సిబ్బంది, ఆస్పత్రికి వచ్చే రోగులకు ఇబ్బందిగా మారింది. నూతన భవనం ఎదుట అడ్డుగా ఉండడంతో పాటు అపరిశుభ్రంగా మారి దుర్వాసన వెదజల్లుతోంది. ఉన్నతాధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement