చిరుధాన్యాలతో పౌష్టికాహారం | - | Sakshi
Sakshi News home page

చిరుధాన్యాలతో పౌష్టికాహారం

Sep 26 2026 7:41 AM | Updated on Sep 26 2026 7:41 AM

కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌

సంగారెడ్డి జోన్‌: చిరు ధాన్యాలను ఆహారంగా తీసుకోవడంతో పౌష్టికాహారం లభిస్తుందని కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో 9వ పోషణమాసాన్ని పురస్కరించుకొని ‘మన అంగన్‌ వాడీ– మన బాధ్యత’ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. తెలంగాణను మిల్లెట్స్‌ ఫుడ్‌ స్టేట్‌గా పిలుస్తున్నారని, పోషక విలువలు అధికంగా ఉండే చిరు ధాన్యాలను రోజువారీ ఆహారంలో తీసుకోవాలన్నారు. కూరగాయలు, ఆకుకూరలు, నువ్వులు, బెల్లం, మునగ ఆకులు, తదితర పోషక విలువలు కలిగిన పదార్థాలను గర్భిణులు, బాలింతలు వినియోగించాలన్నారు. జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలకు మిషన్‌ భగీరథ ద్వారా తాగునీటి సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. పీహెచ్‌సీలు, అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పోషణపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఐదేళ్లలోపు చిన్నారులలో ఎదుగుదల, వినికిడి, మాట సమస్య, నడకలో ఇబ్బందులు, పుట్టుకతో వచ్చే లోపాలు తదితర సమస్యలను గుర్తించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లలితాకుమారి, జెడ్పీ సీఈఓ జానకిరెడ్డి, డీఆర్డీఓ జ్యోతి, జిల్లా వైద్యాధికారి లలితాదేవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement