పటాన్‌చెరు టౌన్: ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని రుద్రారం సమీపంలోని గణేశ్ గడ్డ దేవాలయ ఉత్సవాలు శుక్రవారం ఘనంగా ముగిశాయి. స్వామివారికి అర్చకులు అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ రకాల పండ్లతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం గణపతి హోమం నిర్వహించి పల్లకీ సేవ నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. జాతర నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈఓ లావణ్య, జూనియర్ అసిస్టెంట్ ఈశ్వర్ చర్యలు చేపట్టారు.
పోటాపోటీగా లడ్డూ వేలం
గణేశ్‌గడ్డ దేవస్థానంలో లడ్డూ వేలం పోటాపోటీగా నిర్వహించారు.మొదటి లడ్డూను రామచంద్రపురానికి చెందిన ప్రత్యూష వరుణ్ రూ.4.30 లక్షలు, రెండో లడ్డూను హైదరాబాద్ అత్తాపూర్‌కు చెందిన సంపత్ రెడ్డి రూ. 3.30 లక్షలు, మూడవ లడ్డూను పటాన్‌చెరు కు చెందిన సాయిచరణ్ గౌడ్ రూ.3.70 లక్షలకు దక్కించుకున్నారు.


