ఎల్‌నినో ప్రభావంతో ఉపాధికి డిమాండ్ జల సంరక్షణ పనులకు అధిక ప్రాధాన్యం
సంగారెడ్డి జోన్: ఉపాధి హామీ పథకం ప్రారంభించిన నాటి నుంచి వేసవిలోనే ఎక్కువగా కూలీలు హాజరై పనులు జరిగేవి. కానీ ఎల్‌నినో ప్రభావంతో వానకాలం సీజన్‌లో కూడా కూలీల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రతీ ఒక్కరికి ఈ పథకం ద్వారా పని కల్పిస్తున్నారు.
వాతావరణం అనుకూలంగా లేక..
వాతావరణ పరిస్థితులు ప్రస్తుతం అనుకూలంగా లేకపోవడంతో పంట సాగు పనులు ఆశించినస్థాయిలో జరగడం లేదు. దీంతో పల్లెల్లో వ్యవసాయ కూలీలతోపాటు ఇతరులు ఉపాధి బాట పట్టారు. పరిస్థితులు అనుకూలంగా ఉంటే రైతులతోపాటు వ్యవసాయ కూలీలు బిజీబిజీగా ఉండేవారు. కలుపుతీత, మందులు పిచికారీ చేయటం, పత్తి తీతతోపాటు ఇతర పనులు జరిగేవి. వర్షాలు సక్రమంగా లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో జూలై నుంచి ఉపాధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
25 లక్షల పని దినాలు పూర్తి
ప్రస్తుత ఆర్థిక ఏడాది ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు 25 లక్షల 45 రోజుల పనిదినాలు పూర్తయ్యాయి. జిల్లావ్యాప్తంగా 613 గ్రామపంచాయతీ పరిధిలో ఉపాధి పనులు సాగుతున్నాయి. జూలై 1న కేంద్ర ప్రభుత్వం వీబీజీ రాంజీగా పేరు మార్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటివరకు సుమారు మూడు లక్షల వరకు పని దినాలు సద్వినియోగం చేసుకున్నారు. వర్షాలు సక్రమంగా కురవకపోవడంతో సాగు పనులు లేక గ్రామీణ ప్రాంత ప్రజలకు పథకం ఓ వరంలా మారింది. ప్రతీ ఏటా వర్షాకాలంలో కూలీల సంఖ్య ఒక్కటి కూడా నమోదు కాకపోయేది. జిల్లాలో 2.19లక్షల జాబ్ కార్డులు ఉండగా ఇందులో 4.30లక్షల మంది కూలీలున్నారు. ప్రస్తుతం నాలుగు వేలకు పైగా కూలీలు హాజరవుతున్నారు. అత్యధికంగా హత్నూర మండలంలో అతి తక్కువగా పటాన్‌చెరులో ఉపాధి పనులకు వస్తున్నారు.
జల సంరక్షణ పనులకు ప్రాధాన్యం
ఎల్‌నినో ప్రభావం కారణంగా ఉపాధి హామీ ద్వారా జల సంరక్షణ పనులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వాలు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఆ మేరకు భవిష్యత్తులో నీటి కరువు పరిస్థితులు ఏర్పడకుండా అధికారులు జల సంరక్షణ పనులు చేపడుతున్నారు. మొక్కలు నాటడం, ఇంకుడు గుంతలు, ఫామ్‌పాండ్‌తోపాటు ఇతర పనులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఎక్కువగా వర్షాలపై ఆధారపడి పంటలు సాగు చేస్తుంటారు. అయితే ఈ ఏడాది వర్షాలు ఎక్కువగా కురవలేదు. దీంతో భూగర్భ జలాలు అడుగంటి పోయే ప్రమాదాలను అధికారులు గుర్తించారు. దీంతో ప్రభుత్వాలు కురిసిన వర్షం చినుకులు ఎక్కడికక్కడ ఇంకిపోయే విధంగా పనులు చేపట్టాల్సిందిగా అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. అదేవిధంగా ఆరుతడి పంటలు, తక్కువ నీరు తక్కువ సమయంలో పంట చేతికొచ్చే విత్తనాల వినియోగంపై దృష్టి సారించారు.
నిమజ్జనం రోజు మద్యం దుకాణాలు బంద్
సంగారెడ్డి టౌన్: గణేశ్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా ప్రజల శాంతిభద్రతల పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని సంగారెడ్డి రెవెన్యూ జిల్లా పరిధిలోని మద్యం దుకాణాలు, బార్లు, కల్లు దుకాణాలు తదితరాలను తాత్కాలికంగా మూసివేయాలని బుధవారం ఓ ప్రకటనలో కలెక్టర్ ప్రతీక్ జైన్ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ ఎకై ్సజ్ చట్టం, 1968లోని సెక్షన్ 20 సంబంధిత నిబంధనల ప్రకారం ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. సంగారెడ్డి రెవెన్యూ జిల్లా పరిధిలోని అన్ని మద్యం దుకాణాలు, 2–ఆ బార్లు, కల్లు దుకాణాలు/కల్లు డిపోలు, ఇ –2 క్యాంటీన్లు మూసివేయాల్సి ఉంటుందని తెలిపారు. ఈ నెల 25వ తేదీ ఉదయం 6:00 గంటల నుంచి సెప్టెంబర్ 26వ తేదీ ఉదయం 6:00 గంటల వరకు అమల్లో ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
వర్షాకాలంలోనూ పెరుగుతున్న కూలీల సంఖ్య
అర్హులైన ప్రతీ ఒక్కరికి పని
అర్హులైన ప్రతీ ఒక్కరికి ఉపాధి పథకంలో పనులు కల్పిస్తాం. ప్రస్తుతం జల సంరక్షణ పనులతోపాటు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వానాకాలంలో పనులు జరుగుతున్నాయి.
–బాల్‌రాజ్, అదనపు పీడీ,
డీఆర్‌డీఏ, సంగారెడ్డి


