మళ్లీ పొంగిన నల్లవాగు | - | Sakshi
Sakshi News home page

మళ్లీ పొంగిన నల్లవాగు

Sep 24 2026 7:52 AM | Updated on Sep 24 2026 7:52 AM

● ఖేడ్‌ డివిజన్‌ పరిధిలో భారీవర్షం ● కంగ్టిలో 8.4 సెంటీమీటర్లు నమోదు

● ఖేడ్‌ డివిజన్‌ పరిధిలో భారీవర్షం ● కంగ్టిలో 8.4 సెంటీమీటర్లు నమోదు

కల్హేర్‌(నారాయణఖేడ్‌)/నారాయణఖేడ్‌: డివిజన్‌ పరిధిలో బుధవారం తెల్లవారు జామున ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో రెండు గంటలపాటు భారీ వర్షం కురిసింది. సిర్గాపూర్‌ మండలంలోని సుల్తానాబాద్‌ గ్రామం వద్ద ఉన్న జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టు నల్లవాగు అలుగుపైనుంచి వరదతో పొంగి పొర్లింది. ప్రాజెక్టు ఇదివరకే నిండగా కురిసిన వర్షానికి తిరిగి భారీగా నీరు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తిసామర్థ్యం 1,493.7 అడుగులు కాగా పూర్తిస్థాయిలో వరద వచ్చి చేరింది. ఇన్‌ఫ్లో 2,040.62 క్యూసెక్కులు కాగా అలుగు పైనుంచి 1,894.62 క్యూసెక్కులు వెళ్లగా కుడి కాలువ ద్వారా 114 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 32 క్యూసెక్కుల చొప్పున రెండు కాలువల ద్వారా 146 క్యూసెక్కుల నీటిని నీటిని కిందకు వదిలినట్లు ప్రాజెక్టు ఏఈ మల్లేశ్‌ తెలిపారు.

వాగుల్లోకి వరద

ఖేడ్‌ ప్రాంతంలో మధ్యాహ్నం వరకు వాగులు ఉధృతంగా ప్రవహించగా కొన్నిచోట్ల వరదనీరు రోడ్లపై నుంచి పారింది. జలవనరుల్లోకి గణనీయంగా నీరు చేరింది. వర్షం వివిధ పంటలకు మేలు చేకూర్చగా, కోతల దశలోఉన్న పలు పంటలకు నష్టం వాటిల్లిందని రైతులు తెలిపారు. కురిసిన వర్షం కంగ్టిలో 84.2 మి.మీలు, ఖేడ్‌లో 43.6, సిర్గాపూర్‌లో 47.4, నిజాంపేటలో 47.2, మనూరులో 39.2, కల్హేర్‌లో 30.4, నాగల్‌గిద్దలో 21 మి.మీలుగా నమోదైంది. మరోసారి ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండడంతో రైతుల్లో సంతోషం వెల్లివిరిసింది. కల్హేర్‌, సిర్గాపూర్‌ మండలాల్లో భారీ వర్షం కురియడంతో వరి, పత్తి, మొక్కజొన్న పంటలకు మేలు జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement