తాగునీరు కష్టమే | - | Sakshi
Sakshi News home page

తాగునీరు కష్టమే

Sep 24 2026 7:52 AM | Updated on Sep 24 2026 7:52 AM

కంది సాగు.. రైతు బాగు కంది సాగులో సస్యరక్షణ చర్యలు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. వివరాలు 8లో u గురువారం శ్రీ 24 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

న్యూస్‌రీల్‌

ఎం.కె, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌లకు

స్పష్టం చేసిన ఈఎన్‌సీ

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

చేసుకోవాలని సూచన

కంది సాగు.. రైతు బాగు కంది సాగులో సస్యరక్షణ చర్యలు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. వివరాలు 8లో u

సింగూరు ప్రాజెక్టు

ఉన్న నాలుగున్నర టీఎంసీలు ఫిబ్రవరి వరకే

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: సింగూరు నుంచి రానున్న వేసవి కాలంలో తాగునీటిని సరఫరా చేసే పరిస్థితి లేదని హైదరాబాద్‌ మెట్రో వాటర్‌ వర్క్‌, మిషన్‌భగీరథ విభాగాలకు నీటిపారుదలశాఖ మరోసారి స్పష్టం చేసింది. ఇప్పుడున్న నీటి నిల్వ ప్రకారం కేవలం ఐదు నెలలు (2027 ఫిబ్రవరి వరకు) మాత్రమే సరఫరా చేయగలుగుతామని నీటి పారుదల శాఖ అధికారులు తేల్చి చెప్పారు. వేసవిలో ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. ఇటీవల నీటి పారుదలశాఖ ఈఎన్‌సీ రమేశ్‌బాబు సింగూరు జలాశయాన్ని సందర్శించారు. కట్ట రివీట్‌మెంట్‌ మరమ్మతు పనులు, కాలువ ఆధునీకరణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఈఎన్‌సీ మిషన్‌భగీరథ, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ విభాగాల అధికారులతో చర్చించి ఈ మేరకు స్పష్టం చేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా బోర్లు, ట్యాంకర్ల సరఫరాపై హెచ్‌ఎండబ్ల్యూఎస్‌, మిషన్‌భగీరథ అధికారులు దృష్టి సారించారు. ఈ మేరకు తమ విభాగాలు చేపట్టిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ఈఎన్‌సీ దృష్టికి తెచ్చారు. ఈ ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో ఎంత మేరకు జిల్లా వాసుల తాగునీటి అవసరాలు తీర్చుతాయనేది ప్రశ్నార్థకంగా మారింది.

ఇప్పటికే క్రాప్‌ హాలిడే..

హైదరాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాలతోపాటు, కామారెడ్డి జిల్లాలోని కొన్ని గ్రామాల తాగునీటికి సింగూరు నీరే ఆధారం. ఈ జలాశయంలో ప్రస్తుతం 4.52 టీఎంసీల నీరుంది. ఎల్‌నినో ప్రభావంతో ఈసారి క్యాచ్‌మెంట్‌ ఏరియాలో వర్షాలు కురవలేదు. దీంతో ప్రాజెక్టులోకి నీరు చేరలేదు. ఇప్పటికే ఆయకట్టుకు క్రాప్‌ హాలిడేను ప్రకటించిన నీటిపారుదల శాఖ ఉన్న ఈ కొద్దిపాటి నీటిని తాగునీటికి అవసరాలకు వినియోగిస్తోంది. జిల్లాలో 912 గ్రామాలు, నివాసిత ప్రాంతాలకు మిషన్‌భగీరథ నీటిని సరఫరా అవుతోంది. అయితే సింగూరులో నీటిమట్టం రోజురోజుకు తగ్గిపోతోంది. నదీ ప్రవాహ ప్రాంతం వెలవెలబోతోంది. దీంతో ఇప్పటికే పలు తాగునీటి పథకాల ఇంటెక్‌ వెల్‌లకు సరిగ్గా నీరు అందడం లేదు. దీంతో రాఘవాపూర్‌, పాంపాడ్‌ వంటి చోట్ల ఉన్న ఇంటెక్‌ వెల్‌లకు సరిగ్గా నీరు అందడం లేదు. వాటి పరిధిలోని గ్రామాలు, నివాసిత ప్రాంతాలకు తప్పించి.. రోజు నీటిని సరఫరా చేస్తున్నారు. మరోవైపు చివరి గ్రామాలకు సరఫరా కూడా నిలిచిపోయింది. జిల్లా కేంద్రం సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీలు, వార్డులకు రెండు రోజులకు ఒకసారి నీటి సరఫరా అవుతోంది. మరోవైపు పరిశ్రమలకు మిషన్‌భగీరథ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. అయితే నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని సరఫరాను నిలిపివేస్తామని ఆయా పరిశ్రమలకు నోటీసులు జారీ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement