పెట్టుబడి కష్టాలు | - | Sakshi
Sakshi News home page

పెట్టుబడి కష్టాలు

Sep 24 2026 7:52 AM | Updated on Sep 24 2026 7:52 AM

చెరుకు పంటను కాపాడుకునేందుకు

శ్రమిస్తున్న రైతులు

జహీరాబాద్‌ టౌన్‌: చెరుకు రైతుల కష్టాలు తీరడం లేదు. ఈ ఏడాది సరైన వర్షాలు లేక చెరుకు పంట ఎదుగుదల దెబ్బతినగా, ఇటీవల వీచిన బలమైన ఈదురు గాలులు, అకాల వర్షాల కారణంగా చెరుకు పంట నేలకొరిగింది. పండిపోయిన చెరుకుగడలను కాపాడుకునేందుకు రైతులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. నేలకొరిగిన పంటను నిటారుగా నిలబెట్టేందుకు జుడి(జడ) కట్టించే పనిలో పడ్డారు. అయితే దీనికోసం ఎకరాకు దాదాపు రూ.6 వేల వరకు అదనంగా ఖర్చు వస్తోందని రైతులు వాపోతు న్నారు. తప్పని పరిస్థితుల్లో అప్పులు చేసి మరీ పంటకు జుడి కట్టిస్తున్నారు. కూలీల కొరత రైతులకు పెద్ద సమస్యగా మారింది. దీంతో కర్ణాటక నుంచి కూలీలను రప్పించి పనులు చేయిస్తున్నారు. చెరుకు పంట సాగు వల్ల ఏటా నష్టాలు ఎదర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి పంటకు మద్దతు ధర పెంచాలని ఇతర పంటల మాదిరిగా బోనస్‌ ఇచ్చి ఆదు కోవాలని రైతులు కోరుతున్నారు.

గణేశ్‌ విరాళాలతో

పసి ప్రాణానికి అండ

రామచంద్రాపురం(పటాన్‌చెరు): వినాయకచవితి పండుగ కోసం సేకరించిన విరాళాలతో ఉత్సవాలు నిర్వహించడం అనంతరం మిగిలి న మొత్తన్ని ఆపదలో ఉన్నవారికి అందిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు రామచంద్రాపురం పట్టణంలోని కాకతీయనగర్‌ కాలనీ కు చెందిన చిన్నారులు. ఈ కాలనీకి చెందిన ఇంటర్మీడియెట్‌ చదువుతున్న అనిరుధ్‌, పదోవ తరగతి చదువుతున్న ఆర్యన్‌ చింతల, 9వ తరగతి ఎల్‌.ఈశ్వర్‌, అఖిలేశ్‌రెడ్డి, మహేశ్‌, ప్రమోద్‌ 2023లో జైబాల గణేశ్‌ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసి గణేశ్‌ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. 2025, 2026లో వినాయక ఉత్సవాలను నిర్వహించి మిగిలిన రూ.2లక్షలను సామాజికసేవకు ఉపయోగించేందుకు ముందుకొచ్చారు. ఇదే సమయంలో నగరంలోని ఏఐజీ ఆస్పత్రిలో పశ్చిమబెంగాల్‌ రాష్ట్రానికి చెందిన ఏడు నెలల వివాన్‌రాయ్‌ కాలేయ మార్పిడి చికిత్స చేయించుకుంటున్న విషయం తెలుసుకుని బాలుడి తండ్రి మనోజీత్‌ రాయ్‌ ను కలసి రూ.2లక్షల విరాళాన్ని అందజేశారు. 2023లో గణేశ్‌ ఉత్సవాలు నిర్వహించి మిగిలిన రూ.32వేలను ఆంధ్రప్రదేశ్‌లోని గుంతకల్‌ ప్రాంతానికి చెందిన ఓ బాలుడు గుండె జబ్బు తో బాధపడుతుంటే అతని చికిత్స కోసం ప్రధాని మోదీకీ డీడీ రూపంలో పంపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement