హుస్నాబాద్‌కు ఐదు కిలోమీటర్ల దూరంలోని జిల్లెల్లగడ్డ, మహ్మదాపూర్, ఉమ్మాపూర్, ఆకునూర్ గ్రామాల మధ్య విస్తరించిన ఈ అటవీ ప్రాంతం ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామంగా మారనుంది. సుమారు 800 మీటర్ల ఎత్తులో విస్తరించిన 36 గుట్టలు పర్యాటకులను ఆకట్టుకోనున్నాయి. 350(3,200 ఎకరాలు) హెక్టార్ల విస్తీర్ణంలో అర్బన్ ఫారెస్ట్ పార్కు నిర్మాణాన్ని చేపట్టారు. అభివృద్ధిలో భాగంగా మూడు పగోడాలు, ఎత్తయిన వాచ్ టవర్లు, వాకింగ్ ట్రాక్‌లు, పిల్లల పార్కు, రెండు గుట్టల మధ్య బ్రిడ్జి, రాయికల్ జలపాతం వద్ద ట్రెక్కింగ్ స్పాట్ ఏర్పాటు చేయనున్నారు. అదనంగా ఉద్యానవనాలు, గడ్డి మైదానాలు, పర్యాటకులకు విశ్రాంతి సౌకర్యాలు కల్పించనున్నారు. అలాగే రాయికల్ వాటర్ ఫాల్స్ వద్ద ట్రెక్కింగ్, గుట్టల మధ్య బోటింగ్, ఓపెన్ జిమ్, సాహస క్రీడలు లాంటి సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.


