ప్రకృతి, చారిత్రక సంపద ఉన్న హుస్నాబాద్ నియోజకవర్గాన్ని మోడల్ టూరిజం హబ్‌గా మారుస్తాం. ఎల్లమ్మ చెరువు గ్లాస్ బ్రిడ్జి, రాయికల్ జలపాతం, మహాసముద్రం గండి, సర్దార్ సర్వాయి పాపన్న అర్బన్ ఫారెస్ట్ పార్కును గౌరవెల్లి ప్రాజెక్టుతో అనుసంధానిస్తూ సమగ్ర పర్యాటక కారిడార్‌గా అభివృద్ధి చేస్తున్నాం. పార్కు పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ సర్క్యూట్ ద్వారా స్థానిక యువతకు ఉపాధి, వ్యాపార అవకాశాలు సమృద్ధిగా లభిస్తాయి. ఈ పార్కు మూడు జిల్లాలకు సరిహద్దు కావడంతో పర్యాటకుల సందడి పెరుగుతుంది. దీంతో హుస్నాబాద్ ముఖచిత్రమే మారనుంది. – మంత్రి పొన్నం ప్రభాకర్


