మెదక్‌జోన్: మెదక్ పాతబస్టాండ్ సమీపంలోని ఓకాజ్ మెడికల్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్టు సీఐ మహేశ్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మృతుడి వయస్సు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందని తెలిపారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామని, సమాచారం తెలిస్తే పోలీసులను సంప్రదించాలని ఆయన కోరారు.
వ్యవసాయ శాఖ గోడౌన్ దగ్ధం
జోగిపేట(అందోల్): పట్టణంలోని వ్యవసాయ శాఖగోడౌన్‌లో శనివారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికుల సమాచారంతో ఎస్‌ఐ గిరి శ్రీకాంత్ ఫైర్ సిబ్బందితో ఘటనా స్థ లానికి చేరుకున్నారు. జేసీబీ సాయంతో తలుపులు తొలగించి మంటలను ఆర్పేశారు. వ్యవసాయ పరికరాలు, పర్నీచర్ దగ్ధమయ్యా యి. ఈ ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు.


