చేగుంట(తూప్రాన్): లారీడ్రైవర్ అదృశ్యమైనట్లు ఎస్‌ఐ చైతన్య కుమార్‌రెడ్డి తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి గ్రామానికి చెందిన లారీడ్రైవర్ అంబటి చిన్నస్వామి వరంగల్‌లో పొట్టులోడు నింపుకొని 5న రామంతపూర్ శివారు జాన్స్ పాఠశాల సమీపంలో లారీ నిలిపాడు. ఆగిఉన్న ఆ లారీని డీసీఎం వ్యాను ఢీకొట్టింది. నాటి నుంచి చిన్నస్వామి ఆచూకీ తెలియలేదు. దీంతో అతడి భార్య మున్నీ చేగుంట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.


