చెరకు టన్నుకు రూ.4వేలు చెల్లించాల్సిందే
రైతు సంఘం నేతల తీర్మానం
జహీరాబాద్: చెరకు రైతులకు న్యాయమైన ధర ఇచ్చే వరకు వెనక్కి తగ్గమని, ఆందోళన చేపట్టి గిట్టుబాటు ధర సాధించుకోవాలని రైతులు, రైతు సంఘం నాయకులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. శనివారం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో జహీరాబాద్ ప్రాంత చెరకు రైతులు సమావేశమయ్యారు. ప్రధానంగా చెరకు పంటకు గిట్టుబాటు ధర చెల్లించాలని యాజమాన్యాలను డిమాండ్ చేశారు. పక్కనే ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలో అక్కడి కర్మాగారాల యాజమాన్యాలు చెల్లించే ధరలను పరిగణలోకి తీసుకోవాలన్నారు. చెరుకు కోత, రవాణా ఖర్చులను యాజమాన్యాలే భరిస్తూ టన్నుకు రూ.4వేలు తగ్గకుండా ధర ప్రకటించాలన్నారు. అనంతరం రైతులు సీడీసీ చైర్మన్ ముబీన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా సీడీసీ చైర్మన్ మాట్లాడుతూ.. రైతుల డిమాండ్లను ప్రభు త్వం దృష్టికి తీసుకెళతామన్నారు. అంతే కాకుండా యాజమాన్యాల ముందు ప్రతిపాదించి, గిట్టుబా టు ధర ఇచ్చేలా కృషి చేస్తానన్నారు. యాజమాన్యా లు చెరుకు రైతులకు గిట్టుబాటు ధరను చెల్లించే విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తే ప్రభుత్వం జోక్యం చేసుకుని పరిష్కరించేలా చూస్తామని సెట్వి న్ కార్పొరేషన్ చైర్మన్ ఎన్.గిరిధర్‌రెడ్డి అన్నారు.


