పటాన్చెరు: నిబంధనలు పాటించని ఆస్ప త్రులపై చర్యలు తప్పవని డీఎంహెచ్ఓ అలితాదేవి అన్నారు. శనివారం బీరంగూడ ప్రాంతాల్లోని పలు ప్రైవేట్ ఆస్పత్రులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, నిబంధనల అమలును పరిశీలించారు. ఆస్పత్రుల్లో ప్రతి రోజు పరిసరాల పరిశుభ్రత పాటించాలని, ఎంటీపీ సర్టిఫికెట్లు ఉన్న ఆస్పత్రుల్లో మాత్రమే సంబంధిత సేవలు అందించాలని సూచించారు. సిబ్బంది అందరికీ గుర్తింపు కార్డులు ఉండాలని సూచించారు. తనిఖీల్లో డాక్టర్ రజని, ఇతర అధికారులు పాల్గొన్నారు.


