నారాయణఖేడ్: టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌ను శనివారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో డీసీసీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో కాంగ్రెస్‌ను క్షేత్రస్థాయి నుంచి మరింత పటిష్టం చేయడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగా లని మహేశ్ కుమార్ గౌడ్ సూచించారు. పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేయాలన్నారు.
‘తోషిబా’లో సీఐటీయూ జయకేతనం
పటాన్‌చెరు టౌన్: ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని రుద్రారం తోషిబా పరిశ్రమలో శనివారం జరిగిన యూనియన్ ఎన్నికల్లో ఐఎన్‌టీయూసీ, బీఎంఎస్ కూటమిపై సీఐటీయూ 50 ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. దీంతో మల్లికార్జున్ ఐదోసారి యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈసందర్భంగా పరిశ్రమలో కార్మికులు విజయోత్సవాలు నిర్వహించారు. మల్లికార్జున్ మాట్లాడుతూ.. మెరుగైన వేతన ఒప్పందాలు, కార్మిక సంక్షేమం, సౌక ర్యాల కల్పన సీఐటీయూతోనే సాధ్యమన్నారు. కార్మికుల మధ్య విభేదాలు సృష్టించి అడ్డదారిలో గెలవాలనుకున్న వారికి ఈ విజయం చెంపపెట్టని అన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి, యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజయ్య, ఉపాధ్యక్షులు పాండురంగారెడ్డి, వాజిద్ అలీ, అనంతరావు, అతిమేల మాణిక్, వెంకటేశ్వర్లు, శ్రీరాములు, రాజు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థికి అరుదైన గౌరవం
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): మండలంలోని నిజాంపూర్ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న చిట్కుల అనుదీప్తికి అరుదైన గౌరవం దక్కింది. గత విద్యా సంవత్సరంలో 90 శాతం కన్నా ఎక్కువ హాజరు ఉండడంతో రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ విద్యార్థిని అభినందిస్తూ ప్రశంసాపత్రం అందించారు. ఈసందర్భంగా హెచ్‌ఎం రామకృష్ణ, సర్పంచ్ తులసి మాట్లాడుతూ.. మిగతా విద్యార్థులు కూడా అనుదీప్తిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు నిర్మల, ఉపాధ్యాయులు నవనీత, అంగన్‌వాడీ టీచర్ సువర్ణ, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
హవేళిఘణాపూర్(మెదక్): క్రీడల్లో పాల్గొనే విద్యార్థులకు ఏకాగ్రత, చురుకుదనం, వేగం అవసరమని డీఈఓ రాజు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని పీఎన్‌ఆర్ ఇండోర్ స్టేడియంలో పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్–14, 17 బాలుర విభా గాల్లో ఉమ్మడి జిల్లాస్థాయి షటీల్ పోటీలు విజయవంతంగా ముగిశాయి. ఈ పోటీల్లో ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన సుమారు 200 మంది క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.


