దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

దరఖాస్తుల ఆహ్వానం

Sep 20 2026 7:42 AM | Updated on Sep 20 2026 7:42 AM

వర్గల్‌(గజ్వేల్‌): వర్గల్‌ జ్యోతిబాపూలే గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న గెస్ట్‌ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జి.భాస్కరరావు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కామర్స్‌, కంప్యూటర్‌ సైన్సు ఫ్యాకల్టీ కోసం సంబంధిత సబ్జెక్టులో పీజీ, నెట్‌, సెట్‌ బోధనా అనుభవం కలిగిన అభ్యర్థులు సోమవారం ఉదయం 10 గంటలకు కళాశాల ప్రాంగణంలో నిర్వహించే డెమో, ఇంటర్వ్యూకు హాజరుకావాలని కోరారు. మరిన్ని వివరాల కోసం 7995076688, 9440698470 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

సెమినార్లతో శాసీ్త్రయ దృక్పథం

డీఈఓ రాజు

మెదక్‌జోన్‌: విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించడానికి సైన్సు సెమినార్లు ఎంతో దోహదపడతాయని జిల్లా విద్యాధికారి రాజు అన్నారు. స్థానిక పీఎం శ్రీ తెలంగాణ బాలికల గురుకుల పాఠశాలలో శనివారం నిర్వహించిన జిల్లాస్థాయి సైన్సు సెమినార్‌ విజేతలకు ప్రశంసాపత్రాలు అందజేశారు. భారతీయ ఇంధన వనరులపై విద్యార్థులు తమ సెమినార్‌ పత్రా లను అందజేశారు. ఇందులో ప్రతిభ కనబర్చి న విజేతలకు ఆయన ప్రశంసాపత్రాలు అందించారు. కార్యక్రమంలో జిల్లా సైన్సు అధికారి రాజిరెడ్డి, ఎంఈఓ శంకర్‌, స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ నవీన్‌ కుమార్‌, సెమినార్‌ నిర్వహణ కమిటీ సభ్యులు ప్రభు, లక్ష్మి, స్రవంతి పాల్గొన్నారు.

లైన్‌మెన్‌కు తీవ్రగాయాలు

నంగునూరు(సిద్దిపేట): విద్యుదాఘాతంతో లైన్‌మెన్‌కు తీవ్ర గాయాలైన ఘటన పాలమాకులో శనివారం చోటు చేసుకుంది. గ్రామస్తులు కథనం ప్రకారం.. రాంపూర్‌ సబ్‌స్టేషన్‌ పరిధిలోని పాలమాకుల జేఎల్‌ఎమ్‌గా పడిగె శ్రీనివాస్‌ విధులు నిర్వహిస్తున్నారు. విద్యుత్‌ సమస్య ఏర్పడడంతో ఎల్‌సీ తీసుకొని గ్రామంలోని హన్‌మాన్‌ దేవాలయం సమీపంలోని ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్‌షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు అతడిని సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని గ్రామస్తులు ఆరోపించారు.

విద్యుదాఘాతంతో గేదె మృతి

తొగుట(దుబ్బాక): విద్యుదాఘాతంతో పాడిగేదె మృతి చెందిన ఘటన మండలంలోని లింగంపేటలో శనివారం చోటుచేసుకుంది. బాధితరైతు, గ్రామ స్తుల కథనం ప్రకారం.. చిక్యుడు యాదయ్య రోజూ మాదిరిగా మేత కోసం గేదెలను తన పొలంలో వదిలాడు. అందులో ఒక గేదె మేతమేస్తూ సమీపంలోని ట్రాన్స్‌ఫార్మర్‌ను తాకడంతో ప్రమాదవశాత్తు విద్యుత్‌ షాక్‌కుగురై అక్కడికక్కడే మృతిచెందింది. గేదె విలువ సుమారు రూ.80 వేలు ఉంటుందని రైతు విలపించాడు. ప్రభుత్వం అతడిని ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.

రెండు తలల దూడ జననం

కొద్ది సేపటికే మృతి

బెజ్జంకి(సిద్దిపేట): మండలంలోని నర్సింహులపల్లెకు చెందిన రైతు పాడిగేదె శనివారం రెండు తలల దూడకు జన్మనిచ్చింది. దూడను చూడటానికి గ్రామస్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అయితే జన్మించిన కొద్ది సమయంలోనే దూడ మృతి చెందింది. ఈ సందర్భంగా పశువైద్యాధికారి మాట్లాడుతూ కవలలు ఏర్పడే సమయంలో అసంపూర్తి విభజనతో జన్మించే ఈదూడలు ఎక్కువ సమయం బతకవన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement