చిరుధాన్యాల సాగేది? | - | Sakshi
Sakshi News home page

చిరుధాన్యాల సాగేది?

Sep 18 2026 9:30 AM | Updated on Sep 18 2026 9:30 AM

పత్తి, మొక్క జొన్న, వరి పంటలపై ఆసక్తి చిరుధాన్యాల పంటలతో మధుమేహం, రక్తపోటు నియంత్రణ వర్షాభావానికి తట్టుకుని నిలబడే పంటలు చిరు ధాన్యాలు

ఒకప్పుడు మన ఆహార సంస్కృతిలో

భాగమైన చిరుధాన్యాల సాగు క్రమంగా కనుమరుగవుతోంది. నాడు గ్రామీణ ఇళ్లలో సజ్జ సంగటి సువాసన వెదజల్లేది. జొన్నలు, బొబ్బర్లు, మినుములు,

ఉలవలు, పెసర, వేరుశనగ మన జీవితంలో భాగమయ్యేవి. కాలక్రమేణ అధిక దిగుబడి మార్కెట్‌ ఆశతో రైతులు

వాణిజ్య పంటల వైపు పరుగులు తీశారు.

ఫలితంగా తరతరాలుగా మన ఆహార సంస్కృతికి అద్దంపట్టిన చిరుధాన్యాల సాగు అతి స్వల్ప విస్తీర్ణానికే పరిమితమైపోయింది. –మునిపల్లి(అందోల్‌)

జిల్లాలో మొక్కజొన్న 7,364, మినుము 6,250, పెసర 8002, కంది 71,961, పత్తి 3,56,782, సజ్జ 580, కొర్ర 980 ఎకరాల్లో వివిధ రకాల పంటల సాగు చేస్తున్నట్లు సంబంధిత అధికారుల లెక్కలు చెబుతున్నాయి. కంది, వేరుశనగ, కొర్ర, జొన్న సంప్రదాయ పంటలు కలిపి వెయ్యి ఎకరాలు కూడా దాటలేదు.

భవిష్యత్‌ వ్యవసాయానికి ప్రత్యామ్నాయం

మూడు దశాబ్దాల క్రితం రైతు వ్యవసాయ భూమిలో ఒకే పంట కనిపించేది కాదు. ఒకే భూమిలో సజ్జ, జొన్న, మినుము, పెసలు, కంది, ఉలువలు, వేరుశనగ, పసుపు, మిరప, కొర్రలు, కుసుమ, పొద్దుతిరుగుడు ఇలా ఎన్నో పంటలను రైతులు పండించేవారు. కుటుంబానికి కావాల్సిన అన్ని రకాల ధాన్యాలు, పప్పులు, అన్ని ఇంట్లోనే ఉండేవి. వారు ఆరోగ్యమైన ఆహారం కోసం మార్కెట్‌ వైపు చూడాల్సిన అవసరమే ఉండేదికాదు. ప్రస్తుతం గతంలో పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడంతోపాటు పంటలకు సరిపడా వర్షాలు పడకపోవడం, ఎక్కువగా వర్షాలు పడినా తట్టుకుని నిలబడే పంటలు కాకపోవడంతో రైతులు సాగు చేయలేకపోతున్నారు. ప్రస్తుతం గిట్టుబాటు ధరలు అధిక దిగుబడి ఆశతో రైతులు వాణిజ్య పంటలపై ఆధారపడుతున్నారు. దీంతో పంటల వైవిధ్యం తగ్గిపోతుంది. చిరు ధాన్యాలకు తక్కువ నీరు సరిపోతుంది. ఎరువులు, పురుగు మందుల ఖర్చు కూడా తక్కువ. ఎండలను తట్టుకునే శక్తి ఎక్కువ నేల ఆరోగ్యాన్ని కాపాడటంతోపాటు రైతు పెట్టుబడిని కూడా తగ్గిస్తాయి. వాతావరణ మార్పుల నేపథ్యంలో భవిష్యత్తు వ్యవసాయానికి ఇవే ప్రత్యామ్నాయమని వ్యవసాయధికారులు చెబుతున్నారు.

ఆసక్తి చూపని అన్నదాతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement