విద్యార్థుల పరిశుభ్రతకు పెద్దపీట | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల పరిశుభ్రతకు పెద్దపీట

Sep 18 2026 9:30 AM | Updated on Sep 18 2026 9:30 AM

మద్దూరు(హుస్నాబాద్‌): విద్యార్థుల పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తూ రూ.3లక్షతో నూతన టాయిలెట్లకు నిర్మాణం చేపట్టామని రాష్ట్ర సర్పంచ్‌ల ఫోరం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జాలపల్లి సర్పంచ్‌ చెట్కూరి కమలాకర్‌ తెలిపారు. దూల్మిట్ట మండలంలోని జాలపల్లి గ్రామంలో ఎమ్‌పీయూపీఎస్‌ పాఠశాల నూతన టాయిలెట్ల నిర్మాణానికి గురువారం మాజీ జెడ్పీటీసీ గిరి కొండల్‌రెడ్డితో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ టాయిలెట్ల నిర్మాణం చేపట్టామన్నారు. ప్రైవేట్‌ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ పరుశురామ్‌గౌడ్‌, పంచాయతీ కార్యదర్శి శ్రీను,వార్డు సభ్యులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement