రాగులు, జొన్న, సజ్జలు వంటి పంటల్లో పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి మధుమోహం, రక్తపోటు వంటి సమస్యలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ప్రోటీన్లు, పీచు పదార్థాలు, ఖనిజ లవణాలు, పుష్కలంగా ఉండటంతో వీటిని ప్రతీ ఒక్కరు ఆహారంలో భాగం చేసుకోవాలి. ఆరోగ్యానికి చిన్న చిన్న సమస్యలు వస్తే పూర్వీకులు చెప్పిన దినుసులను వాడాలి. – డాక్టర్ శివకుమార్
చిరు ధాన్యాల సాగుపై దృష్టి పెట్టాలి
సజ్జలు, జొన్నలు, రాగులు, పెసర, మినుము, కంది, కొర్రలు, మిర్చి, వేరు శనగ, కుసుమ, పొద్దు తిరుగు వంటి పంటలు తక్కువ నీటితో సాగవుతాయి. ఇవి నేల సారాన్ని కాపాడటంతోపాటు రైతుకు స్థిరమైన ఆదాయాన్ని అందిస్తాయి. వాణిజ్య పంటలతో పాటు సంప్రదాయ పంటల సాగుపైన రైతులు దృష్టి సారించాలి.
– అనితారెడ్డి, ఏఓ


