కొమురవెల్లి(సిద్దిపేట): భూమిలో భూసారాన్ని పెంచుకుని పంట దిగుబడిని పెంచుకోవాలని ఆత్మ కమిటీ చైర్మన్ జక్కుల తిరుపతి సూచించారు. మండలంలోని మర్రిముచ్చాల రైతు వేదికలో వ్యవపాయ శాఖ అధికారులు గురువారం రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జీవామృతం, ఘనజీవామృతం తయారు వాటి ఉపయోగాలు, నానో ఎరువుల వాడకంపై వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ జంగని రవి, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం సిద్దిపేట శాస్త్రవేత్త డాక్టర్ పల్లవి, ఏడీఏ పద్మ, మండల వ్యవసాయ అధికారి వెంకట్రావమ్మ ,ఏఈఓలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.


