హమారా ప్రసాద్‌పై చర్యలు తీసుకోండి | - | Sakshi
Sakshi News home page

హమారా ప్రసాద్‌పై చర్యలు తీసుకోండి

Sep 18 2026 9:30 AM | Updated on Sep 18 2026 9:30 AM

వర్గల్‌(గజ్వేల్‌): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌పై కల్పిత అంశాలతో అభ్యంతరకరంగా పుస్తకం రాసిన హమారా ప్రసాద్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దళిత, ప్రజా సంఘాల నాయకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌ చేశారు. గురువారం వర్గల్‌లో ఆయన దిష్టిబొమ్మ దహనం చేసి గౌరారం పీఎస్‌లో ఆయనపై ఫిర్యాదుచేశారు. ఆయన రాసిన పుస్తకాన్ని నిషేధించి కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ మండల అధ్యక్షుడు అవుసులపల్లి నవీన్‌, ఎంఈఎఫ్‌ జిల్లా కార్యదర్శి డ్యాగ నవీన్‌కుమార్‌, నాయకులు ఉపకార్‌, సురేష్‌, నరేష్‌, పరశురాం, సత్యనారాయణ, అజీజ్‌, స్వామి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

యువకుడు అదృశ్యం

జహీరాబాద్‌ టౌన్‌: ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువకుడు అదృశ్యమైనట్లు జహీరాబాద టౌన్‌ ఎస్‌ఐ–2 సంగమేశ్వర్‌ తెలిపారు. జహీరాబాద్‌ పట్టణంలోని ఎన్‌జీవోస్‌ కాలనీ చెందిన ఆర్టీసీ డ్రైవర్‌ మఠం శివరాజ్‌ కుమారుడు కార్తీక్‌(18)కు కొన్ని నెలల నుంచి మానసిక స్థితి సరిగ్గా లేదు. ఈ నెల 16న మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో బయటకు వెళ్లిన కార్తీక్‌ ఇంటికి తిరిగి రాలేదు. తండ్రి శివరాజ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు.

బస్సులోనే గుండెపోటుతో మహిళ మృతి

చేర్యాల(సిద్దిపేట): మండల పరిధిలోని చుంచనకోటకు చెందిన బింగి మల్లవ్వ(59) గురువారం ఉదయం అస్వస్థతకు గురైంది. దీంతో ఆస్పత్రికి వెళ్లేందుకు భర్తతో కలిసి బస్సులో సిద్దిపేటకు బయలు దేరారు. బస్సు గుర్జకుంట క్రాస్‌రోడ్‌ దాటిన అనంతరం ఆమె ఒక్కసారిగా తీవ్ర గుండెపోటుకు గురైంది. గమనించిన భర్త, తోటి ప్రయాణికులు వెంటనే 108కి సమాచారం ఇవ్వగా అక్కడకు వచ్చిన 108 సిబ్బంది అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతురాలికి భర్త, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకుందామని వెళ్లిన మల్లవ్వ బస్సులోనే మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తుల్లో తీవ్ర విషాదం నింపింది.

చేపల వేటకు వెళ్లి..

వ్యక్తి మృతి

నర్సాపూర్‌ రూరల్‌: చేపల వేటకు వెళ్లిన వ్యక్తి మృతి చెందిన సంఘటన నర్సాపూర్‌ మండలం తుజాల్‌ పూర్‌ దామర చెరువులో చోటు చేసుకుంది. నర్సాపూర్‌ పోలీసులు కథనం ప్రకారం.. శివ్వంపేట మండలం రూప్ల తండాకు చెందిన కాట్రోత్‌ కిషన్‌ (36) తుజాల్‌పూర్‌ దామర చెరువులోకి వల తీసుకొని చేపలు పట్టేందుకు వెళ్లాడు. రాత్రి 10 గంటల వరకు తిరిగి రాకపోవడంతో భార్య సరిత, కుటుంబ సభ్యులు చెరువు వద్ద ఎక్కిన వెతికిన ఆచూకీ లభించలేదు. తిరిగి గురువారం దామర చెరువులో గాలించగా కిషన్‌ శవం లభించింది. చేపల కోసం వేసిన వల చుట్టుకొని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. భార్య సరిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని శవాన్ని నర్సాపూర్‌ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు.

డ్రగ్‌, గంజాయి డిస్పోజల్‌

నర్సాపూర్‌ రూరల్‌: నర్సాపూర్‌ ఎకై ్సజ్‌ శాఖ పరిధిలోని ఆయా కేసుల్లో స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌ పౌడర్‌, గంజాయిని డిస్పోజల్‌ చేసినట్లు నర్సాపూర్‌ ఎకై ్సజ్‌ సీఐ గులాం ముస్తఫా గురువారం తెలిపారు. నర్సాపూర్‌ మండల పరిధి కాగజ్‌ మద్దూర్‌ వద్ద ఉన్న మెరిడీ బయో కెమికల్‌ లిమిటెడ్‌లో.. ఎకై ్సజ్‌ డిప్యూటీ కమిషనర్‌ ఆదేశాల మేరకు వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న డ్రగ్‌ పౌడర్‌తో పాటు గంజాయిని ధ్వంసం చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఎకై ్సజ్‌ అధికారి నరసింహారెడ్డి, సీఐ జ్ఞానేశ్వర్‌, ఎస్‌ఐ శరత్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement