చిన్నశంకరంపేట(మెదక్): నార్సింగి మండల కేంద్రంలోని గన్నేరువాగు వద్ద బైక్‌ను రెడ్‌మిక్స్ టిప్పర్ ఢీకొనడంతో ఓ యువకుడు మృతి చెందాడు. మండలంలోని శేరిపల్లి గ్రామానికి చెందిన ఇండ్ల సత్యం (30) బుధవారం సాయంత్రం నార్సింగిలో పని ముగించుకుని స్వగ్రామానికి వస్తుండగా, మిర్జాపల్లి వైపు వెళ్తున్న రెడ్‌మిక్స్ టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలైన యువకుడిని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించ గా, చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందాడు.
మిర్జాపల్లి రెడ్‌మిక్స్ ప్లాంట్ వద్ద ఆందోళన ...
చిన్నశంకరంపేట మండలం మిర్జాపల్లి రైల్వేస్టేషన్ సమీపంలోని రెడ్‌మిక్స్ ప్లాంట్ వద్ద శేరిపల్లి గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. యువకుడి కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆందోళనకారులను సముదాయించి, టిప్పర్ యజమానితో చర్చలు జరిపేందుకు చర్యలు చేపట్టారు.


