చెక్‌పవర్‌ రద్దుపై హైకోర్టు స్టే | - | Sakshi
Sakshi News home page

చెక్‌పవర్‌ రద్దుపై హైకోర్టు స్టే

Sep 17 2026 8:35 AM | Updated on Sep 17 2026 8:35 AM

న్యాల్‌కల్‌(జహీరాబాద్‌): మండల పరిధిలోని గుంజోటి గ్రామ సర్పంచ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. సర్పంచ్‌ చెక్‌పవర్‌ను నెల రోజుల పాటు రద్దు చేస్తూ జిల్లా కలెక్టర్‌ జారీ చేసిన ఉత్తర్వులపై రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. వివరాలు.. ఉపాధిహామీ పథకంలో భాగంగా గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనుల బిల్లుల చెల్లింపు విషయంలో సర్పంచ్‌ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడని, ఆయనపై చర్యలు తీసు కోవాలని కోరుతూ గ్రామానికి చెందిన కొందరు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో సర్పంచ్‌ చెక్‌పవర్‌ను నెల రోజుల పాటు నిలిపివేస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. తన చెక్‌పవర్‌ రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని, సర్పంచ్‌ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు కలెక్టర్‌ ఉత్తర్వులపై మధ్యంతర స్టే విధించినట్లు బుధవారం గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సర్పంచ్‌ పాటిల్‌ తెలిపారు. వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement