దుకాణదారులకు జరిమానా | - | Sakshi
Sakshi News home page

దుకాణదారులకు జరిమానా

Sep 17 2026 8:35 AM | Updated on Sep 17 2026 8:35 AM

మెదక్‌ కలెక్టరేట్‌: ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ కవర్లను విక్రయిస్తున్న వ్యాపారులకు రూ.9.500 జరిమానా విధించినట్లు మున్సిపల్‌ కమిషనర్‌ నవీన్‌ తెలిపారు. కమిషనర్‌ ఆదేశాల మేరకు బుధవారం శానిటేషన్‌ అధికారు లు సిబ్బంది పట్టణంలోని దుకాణాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా నిల్వ ఉంచిన సింగిల్‌ యూస్‌ ప్లాస్టిక్‌ కవర్లు స్వాధీనం చేసుకొని యజమానులకు జరిమానా విధించారు. ఆరోగ్యం, సంక్షేమం దృష్టిలో ఉంచుకొని ప్లాస్టిక్‌ కవర్లకు బదులుగా ప్రత్యామ్నాయంగా జ్యూట్‌ బ్యాగులు, బట్ట సంచులు, స్టీల్‌ డబ్బాలు వినియోగించి పర్యావరణాన్ని కాపాడాలని కమిషనర్‌ పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement