పీత వర్ణంలో గణనాథుడు | - | Sakshi
Sakshi News home page

పీత వర్ణంలో గణనాథుడు

Sep 17 2026 8:29 AM | Updated on Sep 17 2026 8:29 AM

పీత వర్ణంలో గణనాథుడు రాహుల్‌ను ప్రధాని చేయడమే లక్ష్యం దరఖాస్తుల ఆహ్వానం నిమజ్జనానికి భారీ బందోబస్తు: డీఎస్పీ

పటాన్‌చెరు టౌన్‌: ఇస్నాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని రుద్రారం గణే్‌శ గడ్డ దేవాలయంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సా గుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు బుధవారం గణేశ్‌ గడ్డ దేవస్థానంలో ఆలయ అర్చకులు సంతోష్‌ జోషి, జగదీశ్వర్‌ స్వామి, చంద్రశేఖర్‌, అయ్యప్ప, సతీష్‌ ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించారు. అనంతరం స్వామివారిని పీత వర్ణంలో విశేషంగా అలంకరించి, భక్తులకు దర్శన భాగ్యం కల్పి ంచారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో నిత్య అన్నదాన కార్యక్రమం కొనసాగుతున్నట్లు ఆలయ ఈఓ లావణ్య, జూనియర్‌ అసిస్టెంట్‌ ఈశ్వర్‌ తెలిపారు.

పటాన్‌చెరు టౌన్‌: రాహుల్‌ గాంధీని ప్రధానిని చేయడమే తమ లక్ష్యమని మెదక్‌ పార్లమెంట్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి నీలం మధు స్పష్టం చేశారు. అయితే దేశ ఐక్యత, సామాజిక న్యాయం, సమ్మిళిత అభివృద్ధి లక్ష్యంగా కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌ వరకు ప్రకాశం జిల్లాకు చెందిన న్యాయవాది కాటూరి వెంకటేశ్వర్లు పాదయాత్ర చేపట్టారు. ఈ మేరకు ఆయనకు బుధవారం ముత్తంగి రింగ్‌ రోడ్డు వద్ద ఘన స్వాగతం పలికారు. అనంతరం పీఎస్‌ఆర్‌ గార్డెన్స్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాహుల్‌ గాంధీని ప్రధానిగా చేయడం కోసం ప్రతి కాంగ్రెస్‌ కార్యకర్త నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. జూన్‌ 19న కన్యాకుమారిలో ప్రారంభమైన ఈ యాత్ర.. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల మీదుగా 1,500 కిలోమీటర్లకు పైగా పూర్తి చేసుకుని పటాన్‌చెరుకు చేరుకుందని తెలిపారు. అనంతరం ఆయనతోపాటు పాదయాత్రలో పాల్గొని ముత్తంగిలో అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

సంగారెడ్డి ఎడ్యుకేషన్‌: జిల్లా పరిధిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలు, కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి తాత్కాలిక ప్రాతిపదికన పార్ట్‌టైమ్‌ టీచర్లను నియమించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈనెల 18 సాయంత్రం 4 గంటలలోగా చిట్కుల్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సమర్పించాలని సూచించారు. 19వ తేదీ ఉదయం 10 గంటలకు తమ విద్యార్హతలకు సంబంధించిన ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, రెండు పాస్‌పోర్ట్‌ సైజు ఫొటోలతో డెమో, ఇంటర్వ్యూలకు హాజరుకావాలన్నారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. మరిన్ని వివరాల కోసం 9704550253, 9640382248 నంబర్లలో సంప్రదించాలన్నారు.

సంగారెడ్డి క్రైమ్‌: పట్టణంలోని మహబూబ్‌సాగర్‌ చెరువులో వినాయక నిమజ్జనానికి కట్టదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్యగౌడ్‌ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. నిర్వాహకులు ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం నిర్వహించాలని సూచించారు. చెరువు కట్టపై పురపాలక సిబ్బందితో పాటు 10 మంది గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచుతామన్నారు. ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు బారికేడ్లు ఏర్పాట్లు చేస్తామన్నారు. మహిళలు, చిన్నారులకు ఇబ్బంది కలగకుండా షీటీమ్స్‌ అందుబాటులో ఉంచుతామన్నారు. చెరువు కట్ట వద్ద పోలీస్‌ కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement