లోధా సామాజిక వర్గంపై నివేదిక | - | Sakshi
Sakshi News home page

లోధా సామాజిక వర్గంపై నివేదిక

Sep 17 2026 8:29 AM | Updated on Sep 17 2026 8:29 AM

బీసీ కమిషన్‌ చైర్మన్‌ నిరంజన్‌

కల్హేర్‌(నారాయణఖేడ్‌): రాష్ట్రంలో వెనకబడిన లోధ్‌, లోధా సామాజిక వర్గం ప్రజల సామాజిక, ఆర్థిక, విద్యా, వృత్తి, జీవన పరిస్థితుల గురించి పూర్తిస్థాయిలో తెలుసుకొని ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని రాష్ట్ర బీసీ కమిషన్‌ చైర్మన్‌ నిరంజన్‌ తెలిపారు. బుధవారం సిర్గాపూర్‌ మండలం కడ్పల్‌, నిజాంపేట్‌ మండల కేంద్రంలో కమిషన్‌ సభ్యులు రాపోలు జయప్రకాశ్‌, తిరుమలగిరి సురేందర్‌, బాలలక్ష్మి, సబ్‌కలెక్టర్‌ ఉమాహరతితో కలిసి పర్యటించారు. ఈసందర్భంగా కమిషన్‌ చైర్మన్‌ మాట్లాడుతూ.. హైదరాబాద్‌, కొన్ని జిల్లాల్లో లోధా సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఉన్నట్లు తమ పరిశీలనలో వెల్లడైందన్నా రు. సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో బీసీ కుల ధ్రువీకరణ పత్రాలు రావడం లేదని కోరుతూ వినతులు అందినట్లు తెలిపారు. స్వాతంత్య్రం అనంతరం, నిజాం సంస్థానం విలీనమైన తర్వాత ఈ సామాజిక వర్గానికి సంబంధించిన వివరాలు, ఆధారాలను సరైన రీతిలో సమర్పించడంలో లోపాలు ఉన్నాయన్న అంశాలను కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ ప్రత్యేక అధికారి సతీష్‌కుమార్‌, జిల్లా అధికారి జగదీశ్‌, డీఏస్పీ వెంకట్‌రెడ్డి తహసీల్దార్లు కిరణ్‌కుమార్‌, నాగజ్యోతి, ఎంపీడీఓలు అండాలమ్మ, సంగ్రామ్‌, నాయకులు యాదవరెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement