చరిత్రను వక్రీకరించడం సరికాదు | - | Sakshi
Sakshi News home page

చరిత్రను వక్రీకరించడం సరికాదు

Sep 17 2026 8:29 AM | Updated on Sep 17 2026 8:29 AM

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్క రాములు

సంగారెడ్డి ఎడ్యుకేషన్‌: విమోచనం పేరిట చరిత్రను మతోన్మాద శక్తులు చరిత్రను వక్రీకరిస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్క రాములు అన్నారు. బుధవారం సంగారెడ్డిలో తెలంగాణ సా యుధ రైతాంగ పోరాట వారోత్సవాల సందర్భంగా దొడ్డి కొమురయ్య విగ్రహం నుంచి సంగారెడ్డి న్యూ బస్టాండ్‌ వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా రాములు మాట్లాడుతూ.. నిజాం రజాకార్ల అకృత్యాలకు వ్యతిరేకంగా పోరాడి 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిన చరిత్ర కమ్యూనిస్టులదేనన్నారు. సాయుధ పోరాటానికి ఆర్‌ఎస్‌ఎస్‌, జీజేపీకి ఏ మాత్రం సంబంధం లేదన్నారు. మతం పేరిట ప్రజలను చీల్చేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలందరూ బీజేపీ తప్పు డు ప్రచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. సాయుధ పోరాట స్ఫూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రజా వ్యతిరేక విధానాలపై మరిన్ని పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మల్లేశం, మాణిక్‌, నర్సింలు, జిల్లా కమిటీ సభ్యులు శివ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement