మునిపల్లి(అందోల్): రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా భూ రీసర్వే చేయాలని అదనపు కలెక్టర్ సంగీత అధికారులకు సూచించారు. బుధవారం మండలంలోని హైద్లాపూర్‌లో భూ రీసర్వేను స్వయంగా పరిశీలించారు. గ్రామంలో ఎన్ని సర్వే నంబర్లు ఉన్నాయి. ఎన్ని నంబర్లలో ఇప్పటివరకు రీ సర్వే నిర్వహించారనే విషయాలను తహసీ ల్దార్ రంగారావును అడిగి తెలుసుకున్నారు. సర్వే సమయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు పెట్టవద్దని, వారికి ముందుగా సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రంగారావు, సర్వేయర్లు, తహసీల్ధార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.


