జహీరాబాద్: జహీరాబాద్ డివిజన్ డిప్యూటీ డీఎంహెచ్‌ఓగా డాక్టర్ జె.సీతారామరాజు నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. బుధవారం జిల్లా వైద్యాధికారి లలితాదేవి వద్ద రిపోర్టు చేశారు. సీతారామరాజు ఇంతకుముందు మొగుడంపల్లి, నారాయణఖేడ్‌లో విధులు నిర్వర్తించి మంచిర్యాలకు పదోన్నతిపై బదిలీ అయ్యారు. ప్రస్తుతం అక్కడి నుంచి జహీరాబాద్ డివిజన్‌కు డిప్యూటీ డీఎంహెచ్‌ఓగా బదిలీపై వచ్చారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన పరిధిలోని ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాల్లో వైద్య సిబ్బంది హాజరుపై దృష్టి పెడతానన్నారు. మందుల కొరత లేకుండా తగు చర్యలు తీసుకుంటానన్నారు. ప్రజలకు మెరుగైన సేవలందించి, సీజనల్ వ్యాధుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడతానన్నారు.


