చేనేత కళను కాపాడుకుందాం | - | Sakshi
Sakshi News home page

చేనేత కళను కాపాడుకుందాం

Sep 16 2026 8:52 AM | Updated on Sep 16 2026 8:52 AM

చేనేత కళను కాపాడుకుందాం

దుబ్బాక: అంతరించిపోతున్న చేనేత కళను కాపాడుకుందామని దుబ్బాక చేనేత సహకార సంఘం చైర్మన్‌ అంకం మధు అన్నారు. స్టడీ టూర్‌లో భాగంగా మంగళవారం దుబ్బాక మండలం హబ్షీపూర్‌ జెడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలకు చెందిన 7,8 తరగతుల విద్యార్థులు సోషల్‌ టీచర్‌ కృష్ణ నేతృత్వంలో చేనేత సొసైటీని సందర్శించారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులు మగ్గాలపై వస్త్రాలను ఎలా నేస్తారు? రంగులు అద్దడం, ఆసు పోయడం, దారాల అల్లిక , జకార్డ్‌ మగ్గాల పనితీరుపై విద్యార్థులకు చైర్మన్‌ వివరించారు. ఒకప్పుడు దుబ్బాక చేనేత పరిశ్రమ దేశంలోనే ప్రసిద్ధి గాంచిందని పేర్కొన్నారు. గొల్లభామ చీరతో పాటు పలు కళాఖండాలను ఆవిష్కరించిన నేత కార్మికులు చాలా దుర్భర పరిస్థితుల్లో ఉన్నారన్నారు. ఈ సందర్భంగా విద్యార్ధులు మగ్గాలపై చేనేత కార్మికులు తయారు చేస్తున్న చీరలు, టవల్స్‌ను ఆసక్తిగా తిలకించారు.

దుబ్బాక చేనేత సంఘం చైర్మన్‌ మధు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement