దుబ్బాకటౌన్: ప్రకృతి వ్యవసాయంతో సాగు ఖర్చులు తగ్గడంతో పాటు నేల సారం, పర్యావరణ పరిరక్షణకు ఎంతో ప్రయోజనం ఉంటుందని జిల్లా వ్యవసాయ అధికారి స్వరూప రాణి అన్నారు. మంగళవారం రాయపోల్ రైతు వేదికలో నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమంలో జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ పథకంపై రైతులకు అవగాహన కల్పించారు. వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేందర్ మోహన్‌వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఫార్మర్ కిట్ల పంపిణీని ప్రారంభించిన అనంతరం, రాయపోల్‌లో రైతులకు కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించి స్థానిక వనరులతో సహజ పద్ధతుల్లో సాగు చేయడం ప్రకృతి వ్యవసాయం ప్రధాన లక్ష్యమన్నారు. దీనివల్ల సాగు వ్యయం తగ్గడంతో పాటు నేల సారం, నీటి నిల్వ సామర్థ్యం మెరుగుపడి దీర్ఘకాలంలో స్థిరమైన దిగుబడులు సాధించవచ్చన్నారు.
జిల్లా వ్యవసాయ అధికారి స్వరూప రాణి


