సిద్దిపేటజోన్: ప్రముఖ ప్రకృతి వ్యవసాయ రైతు, రైతు నేస్తం అవార్డు గ్రహీత సామ ఎల్లారెడ్డి సోమవారం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. మంగళవారం ఆయన స్వగ్రామం సిరిసిల్ల జిల్లా లింగంపల్లిలో అంత్యక్రియలు పూర్తయ్యాయి. స్పెయిన్ దేశంలో ఉద్యోగాన్ని వదులుకొని స్వదేశంలో సేంద్రియ వ్యవసాయాన్ని చేపట్టి ప్రకృతి వ్యవసాయ రైతుగా పేరు సాధించాడు. రసాయనిక ఎరువుల వాడకం లేకుండా సహజసిద్ధమైన వ్యవసాయ పద్ధతులను ఆచరిస్తూ, సేంద్రియ వ్యవసాయంపై ప్రచారం చేశారు. సిద్దిపేట, కరీంనగర్ ప్రాంతాల్లో ఆహార యోగ పేరిట సేంద్రియ ఉత్పత్తుల స్టోర్ ప్రజలకు అందుబాటులోకి తెచ్చి గుర్తింపు పొందారు. 2016లో ఆయనకు రైతు నేస్తం అవార్డు లభించింది.


