ప్రకృతి వ్యవసాయంతో లాభాలు | - | Sakshi
Sakshi News home page

ప్రకృతి వ్యవసాయంతో లాభాలు

Sep 16 2026 8:52 AM | Updated on Sep 16 2026 8:52 AM

ప్రకృతి వ్యవసాయంతో లాభాలు

నర్సాపూర్‌ రూరల్‌: ప్రకృతి వ్యవసాయంతో మంచి లాభాలు సాధించవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి దేవ్‌కుమార్‌ రైతులకు సూచించారు. మంగళవారం మండలంలోని లింగాపూర్‌ రైతువేదికలో ప్రకృతి వ్యవసాయ సాగుకు ఎంపికై న చిన్నచింతకుంట, జక్కపల్లి రైతులకు ప్రకృతి వ్యవసాయ సాగుపై ఒక్క రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రసాయన ఎరువులు వాడకుండా, సేంద్రియ ఎరువులతో పంటలు పండిస్తే నేలతో పాటు వాటిని భుజించిన మనుషుల ఆరోగ్యం బాగుంటుందన్నారు. టీఆర్‌ వికె శాస్త్రవేత్త డాక్టర్‌ సతీశ్‌ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకృతి వ్యవసాయం కోసం అనేక రాయితీలు అందిస్తున్నాయని తెలిపారు. ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించవచ్చన్నారు. అనంతరం రైతులకు కావలసిన ఆయా రకాల కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో నర్సాపూర్‌ ఏడీఏ సంధ్యారాణి, మండల వ్యవసాయ అధికారి దీపిక, ఏఈలు, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్‌ గుప్తా, రైతులు పాల్గొన్నారు.

జిల్లా వ్యవసాయ అధికారి దేవ్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement