మద్దూరు(హుస్నాబాద్): భూ తగాదా విషయంలో సొంత అన్న కొడుకుపై కత్తితో దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం ఎస్‌ఐ మహ్మద్ ఆసీఫ్ కేసు వివరాలు వెల్లడించారు. దూల్మిట్ట మండలంలోని హనుమతండా పరిధిలోని మహారాజ్ తండాకు చెందిన సభావత్ దేవేందర్ తన అన్న కొడుకు సభావత్ రాకేశ్‌తో కొన్నేళ్లుగా భూ తగాదాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఈ నెల 1న ఉదయం బావి వద్ద గొడవ జరిగిన అనంతరం మధ్యాహ్నం ఇంటికి వెళ్లాడు. తర్వాత దేవేందర్ రాజేశ్‌పై కత్తితో దాడి చేయగా అతడికి తల వెనుక భాగంలో గాయమైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు దేవేందర్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. నిందితుడ్ని చేర్యాల జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చగా కోర్టు రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.


