హుస్నాబాద్‌రూరల్: ముదిరాజ్ కుల సంఘం భూమిని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకొని మా భూమి మాకు ఇవ్వాలని అక్కన్నపేట మండలం గుబ్బడీ గ్రామస్తులు ఆర్డీవో కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా ముదిరాజ్‌లు మాట్లాడుతూ.. గుబ్బడి ముదిరాజ్ కుల సంఘం కోసం జనగామ శివారులో రెండెకరాల భూమి కొనుగోలు చేశామని, దీనిని అప్పటి కుల సంఘం నాయకుడు రాజయ్య అక్రమంగా ఆర్వోఆర్‌లో పట్టా చేసుకున్నారని ఆరోపించారు. వంద కుటుంబాలకు చెందిన కుల సంఘం భూమిని అక్రమంగా కుల పెద్దకు ఎట్లా పట్టా చేశారని ప్రశ్నించారు. ఆర్డీవో స్పందించి గ్రామంలో విచారణ జరిపించి, అక్రమంగా చేసిన పట్టాను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ప్రజావాణిలో ఆర్డీవో రాంమూర్తికి వినతి పత్రం అందించారు.
న్యాయం చేయాలని ఆర్డీవోకు వినతి


