అదనపు కలెక్టర్ పాండు
సంగారెడ్డి జోన్: జిల్లాలో ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా నోటీసుల జనరేషన్‌్ ప్రక్రియను వేగవంతం చేసి పూర్తి చేస్తున్నామని అదనపు కలెక్టర్ పాండు తెలిపారు. సోమ వారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 27న నిర్వహించనున్న గ్రామ, వార్డు సభలను పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నా రు. ఇప్పటికే గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి, ఎస్‌ఐఆర్ ప్రక్రియపై వివరించినట్లు తెలిపారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అంతకు ముందు కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తం 37 వినతులు రాగా అధికారులతో కలిసి స్వీకరించారు.


