ఖబ్రస్థాన్‌ భూమి కబ్జా | - | Sakshi
Sakshi News home page

ఖబ్రస్థాన్‌ భూమి కబ్జా

Aug 25 2026 12:10 PM | Updated on Aug 25 2026 12:10 PM

హత్నూర(సంగారెడ్డి): ఖబ్రస్థాన్‌ భూమి కబ్జాకు గురైంది. ఓ బడా నాయకుడు ఏకంగా గేటు ఏర్పాటు చేసి చుట్టూ ఫెన్సింగ్‌ వేశాడు. అయినా అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. హత్నూర మండలం షేర్‌ఖాన్‌పల్లి శివారులోని సర్వే నంబర్‌ 111లో 22 గుంటల భూమి ఖబ్రస్థాన్‌ పేరుపై రెవెన్యూ రికార్డులో నమోదైంది. ప్రధాన రహదారి పక్కన ఉన్న ఈ భూమికి భారీ డిమాండ్‌ ఉంది. దీంతో ఆ నాయకుడి కన్ను ఈ భూమిపై పడింది. ఇంకేముంది దర్జాగా కబ్జా చేశాడు. ఈ విషయం కలెక్టర్‌తో పాటు రెవెన్యూ అ ధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వల్లే కబ్జాకు గురవుతున్నాయని వాపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement