బుధవారం శ్రీ 12 శ్రీ ఆగస్టు శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

బుధవారం శ్రీ 12 శ్రీ ఆగస్టు శ్రీ 2026

Aug 12 2026 7:54 AM | Updated on Aug 12 2026 7:54 AM

బుధవారం శ్రీ 12 శ్రీ ఆగస్టు శ్రీ 2026 రహదారులు యమడేంజర్‌

న్యూస్‌రీల్‌

సత్వార్‌ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం రాజగిరిలో విషాదఛాయలు నెత్తురోడిన రహదారులు గతంలో 917 ప్రమాదాలు 423 మంది మృత్యువాత

ప్రమాదం వెంటాడటంతో గాలిలో కలిసిన కూలీల ప్రాణాలు

జహీరాబాద్‌ టౌన్‌/సంగారెడ్డి క్రైమ్‌: సొంత ఊరులో పనులు లేక ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వచ్చి బతుకు జీవుడా అంటూ సొంతూరుకు వెళ్తుంటే ప్రమాదం వెంటాడటంతో కూలీల నిండు ప్రాణాలు గాలిలో కలిపోయాయి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మండలంలోని సత్వార్‌ గ్రామ సమీపంలో 65వ జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు కూలీలు, ఆటో డ్రైవర్‌ మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు కావడంతో వారి పరిస్థితి విషమంగా ఉంది. రాష్ట్ర సరిహద్దులోని కర్ణాటక రాష్ట్రంలోని రాజగిరి గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు ప్రతీ రోజు జహీరాబాద్‌ ప్రాంతంలో కూలీ పనులకు వచ్చి తిరిగి వెళ్తుంటారు. ఈ క్రమంలోనే గ్రామానికి చెందిన నిర్మల,నిఖిత,తుల్జమ్మ,చంద్రకళ, రాధిక, శిల్ప, శోభ, రేఖ,శ్రీదేవి, కవిత, రేష్మలు ఆటో డ్రైవర్‌ దేవిదాస్‌తో కలిసి కోహీర్‌ గ్రామానికి వచ్చారు. సోయాబిన్‌ పంటలో కలుపు పనులు ముగించుకుని పాటలు పాడుకుంటూ తిరిగి స్వగ్రామానికి వెళ్తున్నారు. 65వ జాతీయ రహదారిపై సత్వార్‌ సమీపంలో వెనుకనుంచి వేగంగా వస్తున్న ఆయిల్‌ ట్యాంకర్‌ ఆటోను బలంగా ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్నవారు కొంతమంది చెల్లాచెదురుగా ఎగిరిపడ్డారు. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌ దేవిదాస్‌, కూలీలు శ్రీదేవి,రేఖ,కవిత,రేష్మలు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో దుర్మరణం పాలైన వారితో గాయపడిన వారి రోదనలతో ఆ ప్రాంతమంతా భీతావహమైంది. చికిత్స పొందుతూ ఆటో డ్రైవర్‌ భార్య నిఖిత మృతి చెందింది. విషయం తెలియగానే మృతుల కుటుంబ సభ్యులు జహీరాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చి చనిపోయిన వారి చూసి కన్నీటి పర్యంతమయ్యారు.

65 నంబర్‌ జాతీయ రహదారిపై ప్రధానంగా కంది, ఇస్నాపూర్‌, సంగారెడ్డి(పోతిరెడ్డి పల్లి) చౌరస్తా, పెద్దాపూర్‌, జహీరాబాద్‌ అలాగే 161 నంబర్‌ జాతీయ రహదారి శివంపేట్‌, సుల్తాన్‌పూర్‌, చౌటాకూరు కూడలిలో రహదారులు డేంజర్‌ స్పాట్లుగా మారాయి. ఈ రహదారుల వద్ద ప్రమాదం జరిగిందని తెలిస్తే ప్రాణం పోయిందని కచ్చితంగా అనుకునే పరిస్థితి నెలకొంది. గ్రామాల నుంచి నిత్యం విద్యార్థులు, వ్యవసాయదారులు, అధికంగా పట్టణానికి రాకపోకలు కొనసాగిస్తుండటంతో నిత్యం ప్రధాన రహదారి చౌరస్తా దాటాల్సిందే. ఈ క్రమంలోనే ద్విచక్ర వాహనాలు, పాదచారులు పెద్ద వాహనాల కింద పడి మృత్యువాత పడుతున్నారు.

జిహీరాబాద్‌ ఆస్పత్రిలో మృతదేహాలు

ప్రమాద ఘటనలో క్షతగాత్రులు...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement