ఎస్పీ పరితోశ్ పంకజ్
సంగారెడ్డి జోన్: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టుతున్నట్లు ఎస్పీ పరితోశ్ పంకజ్ పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీసు అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందికి రివార్డులతో పాటు ప్రశంస పత్రాలు అందించారు. అనంతరం పోలీస్ స్టేషన్లలో వినియోగిస్తున్న వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ...సుదీర్ఘకాలం పెండింగ్‌లో ఉన్న మిస్సింగ్ కేసుల పరిష్కారానికి ఎన్బీడబ్ల్యూ ఎగ్జిక్యూషన్ ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలన్నారు. ప్రణాళికాబద్ధంగా నిర్ణీత గడువులోగా కేసుల దర్యాప్తు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. మహిళల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ఏర్పాటు చేసిన షీ టీమ్స్ నిరంతరం పర్యవేక్షించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అధిక ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను హాట్ స్పాట్‌గా గుర్తించి, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. సీసీ కెమెరాల ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ చైతన్యరెడ్డి, డీఎస్పీలు సత్తయ్యగౌడ్, వెంకటరెడ్డి, సైదా నాయక్, ప్రభాకర్, సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


