గురు శిష్యులు గిన్నిస్‌ రికార్డు సాధించడం అభినందనీయం | - | Sakshi
Sakshi News home page

గురు శిష్యులు గిన్నిస్‌ రికార్డు సాధించడం అభినందనీయం

Aug 12 2026 7:54 AM | Updated on Aug 12 2026 7:54 AM

ఎమ్మెల్యే సునీతారెడ్డి

హత్నూర (సంగారెడ్డి): హత్నూర మండలానికి చెందిన గురు శిష్యులు ఇద్దరు గిన్నిస్‌ బుక్‌ రికార్డు సాధించడం మండలానికి గర్వకారణమని ఎమ్మెల్యే సునీతారెడ్డి పేర్కొన్నారు. గిన్నిస్‌ బుక్‌ రికార్డు సాధించిన గురు శిష్యులు పోచయ్య, మహేశ్‌గౌడ్‌లను సునీతారెడ్డి శాలువాతో సత్కరించి అభినందించారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియం వేదికగా ఇటీవల లండన్‌ దేశానికి చెందిన గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌ సంస్థ నిర్వహించిన కరాటే పోటీల్లో పాల్గొని గిన్నిస్‌ రికార్డు సాధించి మండలానికి మంచి గుర్తింపు తెచ్చారని ఎమ్మెల్యే అన్నారు.

కాంట్రాక్ట్‌ కార్మికులకు

అండగా ఉంటా

ఎమ్మెల్సీ సి.అంజిరెడ్డి

రామచంద్రాపురం(పటాన్‌చెరు): కాంట్రాక్ట్‌ కార్మికులకు అండగా ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడంలో తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్సీ సి.అంజిరెడ్డి స్పష్టం చేశారు. రామచంద్రాపురం పట్టణంలోని ఆయన నివాసంలో మంగళవారం విలేకరులతో సమావేశంలో ఆయన మాట్లాడుతూ రామచంద్రాపురం పరిధిలోని ఇక్రిశాట్‌ సంస్థలో పని చేస్తున్న అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులకు సరైన వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ సమస్య తన దృష్టికి వచ్చిన వెంటనే కేంద్ర, రాష్ట్ర కార్మిక శాఖ అధికారులతో, సదర్‌ ఏజెన్సీతో మాట్లాడి వారి వేతనం పెంచే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి, నాయకులు రాజేందర్‌రెడ్డి, రాజు, రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కౌలు రైతుల సమస్యలను పరిష్కరించాలి

రైతు స్వరాజ్య వేదిక నాయకులు

సంగారెడ్డి: కౌలు రైతుల సమస్యలను పరిష్కరించాలని రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర నాయకులు బి.కొండల్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. తెలంగాణ కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కౌలు రైతుల సమావేశం మంగళవారం శాంతినగర్‌ లోని టీపీటీఎఫ్‌ భవన్‌హాల్‌లో నిర్వహించారు. కౌలు రైతులకు వెంటనే 2011 చట్టం ప్రకారం గుర్తింపు కార్డులిచ్చి, ప్రభుత్వ సబ్సిడీలు, పథకాలు అందించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం అదనపు కలెక్టర్‌ సంగీతకు వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి సాధన కమిటీ నాయకులు కన్నెగంటి రవి, విస్సా కిరణ్‌ కుమార్‌, దళిత బహుజన ఫ్రంట్‌ రాష్ట్ర నాయకులు పి.శంకర్‌, టీపీజేఏసీ జిల్లా కన్వీ నర్‌ వై.అశోక్‌ కుమార్‌, రైతు సంఘాల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు రంగా గౌడ్‌, మంజీర రైతు సంఘం అధ్యక్షుడు పథ్వీరాజ్‌ పాల్గొన్నారు.

శ్మశానవాటిక బోర్డు

ఏర్పాటుపై అభ్యంతరం

సబ్‌ కలెక్టర్‌కు ఫిర్యాదు

నారాయణఖేడ్‌: ఖేడ్‌లోని సాయిబాబా కాలనీ లో ఏర్పాటు చేసిన ముస్లిం శ్మశాన వాటిక బోర్డు విషయంలో స్థానికులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ మేరకు బీజేపీ నియోజకవర్గ కన్వీనర్‌ రజనీకాంత్‌ ఆధ్వర్యంలో నాయకులు, కాలనీవాసులు మంగళవారం స్థానిక సబ్‌ కలెక్టర్‌ ఉమాహారతి, డీఎస్పీ వెంకట్‌రెడ్డి, మున్సిప ల్‌ కమిషనర్‌ ప్రశాంతికి ఫిర్యాదు చేశారు. బోర్డు ఏర్పాటు చేసిన స్థలానికి సంబంధించిన భూమి హక్కులు, రెవెన్యూ రికార్డులు, మున్సి పల్‌ అనుమతులు, ఇతర చట్టపరమైన అనుమతులపై విచారణ జరపాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు చేసిన వారిలో బీజేపీ మండల అధ్యక్షులు దశరథ్‌, పట్టణ అధ్యక్షుడు రాజశేఖర్‌గౌడ్‌, ప్రశాంత్‌, పట్నం మాణిక్‌, సాయేందర్‌, సుగుణాకర్‌ తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement