అడ్మిషన్ గడువు సెప్టెంబర్ 9వరకు..
సిద్దిపేటఎడ్యుకేషన్: గృహిణులు, ఉద్యోగులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చేరి ఉన్నత చదువుల కలను సాకారం చేసుకోవాలని యూనివర్సిటీ విద్యార్థి సేవా విభాగం డైరెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. స్థానిక డిగ్రీ కళాశాలలోని ఓపెన్ యూనియర్సిటీ ప్రాంతీయ విద్యా కేంద్రాన్ని ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అడ్మిషన్లకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడుతూ.. అడ్మిషన్ల గడువును సెప్టెంబర్ 9వరకు పొడిగించామని తెలిపారు. ఈ విద్యా సంవత్సరానికి బీఏ, బీకాం, బీఎస్సీ, ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, బీఎల్‌ఐసీ, ఎంఎల్‌ఐసీ డిప్లమాలకు అడ్మిషన్లు ఉన్నట్లు చెప్పారు. ఆధార్‌కార్డ్, మార్కుల జాబితాలు, ధ్రువపత్రాలతో పాటు రెండు పాస్ ఫొటోలతో ప్రాంతీయ విద్యా కేంద్రంలో సంప్రదించాలని సూచించారు.


