విద్యార్థుల మధ్య ఘర్షణ | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల మధ్య ఘర్షణ

Aug 10 2026 7:20 AM | Updated on Aug 10 2026 7:20 AM

సీపీఎస్‌ను రద్దు చేయాలి
ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు

పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్‌

అధ్యక్షుడు మల్లారెడ్డి

మెదక్‌ కలెక్టరేట్‌: ఈ నెలాఖరులోగా సీపీఎస్‌ను రద్దుచేసి ఉపాధ్యాయులకు పాతపెన్షన్‌ను అమలు చేయాలని పీఆర్టీయూ టీఎస్‌ రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు మల్లారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం మెదక్‌ పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌తోపాటు పీఆర్సీని అమలు చేయాలన్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సుభాష్‌ రెడ్డి, రఘుబాబు, నరేందర్‌ రెడ్డి, రాజేందర్‌ పాల్గొన్నారు.

జిన్నారం (పటాన్‌చెరు): ఇంటర్మీడియెట్‌, పదవ తరగతి విద్యార్థుల మధ్య జరిగిన గొడవ ఆందోళనకు దారి తీసింది. శనివారం గిరిజన దినోత్సవాన్ని పురస్కరించుకొని జిన్నారం పట్టణ కేంద్రంలోని గిరిజన గురుకుల పాఠశాలలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పదవ తరగతి, ఇంటర్మీడియెట్‌ విద్యార్థుల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. తిరిగి ఆదివారం ఇరువర్గాల మధ్య మళ్లీ గొడవ మొదలైంది. కాగా నచ్చజెప్పేందుకు వచ్చిన ఉపాధ్యాయుడిని సైతం విద్యార్థులు నెట్టి వేయడంతో కిందపడ్డాడు. దీంతో పోలీసులకు సమాచారం అందించగా.. వారు వచ్చి ఇరువర్గాల విద్యార్థులకు చదువుకునే వయసులో ఇలాంటి గొడవలు సరికాదని మందలించారు. దీంతో తమ పిల్లలపై తీవ్రంగా దాడి చేశారని విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. అయితే జరిగిన విషయాన్ని పాఠశాల ప్రిన్సిపాల్‌ వెంకటయ్య, సీఐ రమణారెడ్డి విద్యార్థుల తల్లిదండ్రులకు నచ్చజెప్పడంతో సద్దుమనిగింది. కాగా ప్రిన్సిపాల్‌ ఇరువర్గాల మధ్య గొడవకు కారణాలు తేల్చేందుకు ఉపాధ్యాయులతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఘర్షణకు బాధ్యులైన విద్యార్థులపై చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement