15న భారీ భజన కార్యక్రమం | - | Sakshi
Sakshi News home page

15న భారీ భజన కార్యక్రమం

Aug 10 2026 7:20 AM | Updated on Aug 10 2026 7:20 AM

మెదక్‌ కలెక్టరేట్‌: వేల గొంతులు..ఒకే భజన, రామ భజన భక్తి పారవశ్యంతో యువతను చైతన్య పర్చడమే లక్ష్యమని రామభక్త భజన పరివార్‌ సభ్యులు తెలిపారు. రామభక్త భజన పరివార్‌ సభ్యులతో పాటు భక్తులు కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈనెల 15న మెదక్‌ పట్టణంలోని చమన్‌ వీధిలో గల ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో భారీ ఎత్తున భజన కార్యక్రమం చేపట్టామని తెలిపారు. సమాజ ఐక్యతను చాటేలా ఈ భజన కార్యక్రమానికి సన్నాహాలు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి శనివారం ఆలయంలో భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా ఐదో వారం 15న సాయంత్రం 5 గంటలకు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. భజన కార్యక్రమం ద్వారా హిందువుల ఐక్యత, ధార్మిక చైతన్యాన్ని చాటాలని పిలుపునిచ్చారు.

రామభక్త భజన పరివార్‌ కరపత్రం విడుదల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement