నారాయణఖేడ్: మహిళా సంఘాల బలోపేతానికి కృషి చేయన్నట్లు ఉమ్మడి జిల్లా సీ్త్రనిధి క్రెడిట్ సహకార సమాఖ్య డైరెక్టర్ హీనా బేగం తెలిపారు. ఆదివారం నాగల్‌గిద్ద మండలం ఔదత్‌పూర్ గ్రామాన్ని సందర్శించి మహిళా సంఘాలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సంఘాల మహిళా సంఘాలు, గ్రామస్తులు నూతనంగా ఎన్నికై న సందర్భాన్ని పురస్కరించుకొని సన్మానించారు. హీనా బేగం మాట్లాడుతూ మహిళా సంఘాల సభ్యులు పొదుపును రెగ్యులర్‌గా కొనసాగించాలని, తీసుకున్న రుణాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. అర్హులైన ప్రతీ మహిళా సంఘానికి సీ్త్రనిధి ద్వారా రుణాలు అందేలా చూస్తానని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రహీం, శంకర్, శివాజీరావు, యూసుఫ్, శాంతప్ప, జీతప్ప, గిరిజన నాయకులు లచ్చిరామ్, మహిళా సంఘాల నాయకులు శేఖమ్మ పాల్గొన్నారు.


