పోస్టర్‌ను ఆవిష్కరించిన నాయకులు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ట్రైబల్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (టీఐసీసీఐ) ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లాలో ఈ నెల 12న నిర్వహించనున్న అవగాహన సదస్సును విజయవంతం చేయాలని టీఐసీసీఐ తెలంగాణ చాప్టర్ అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్ నాయక్ ధరావత్, టీఐసీసీఐ జిల్లా కో–ఆర్డినేటర్ భూక్య భిక్షపతి నాయక్ అన్నారు. ఆదివారం టీఐసీసీఐ అవగాహన సదస్సు వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గిరిజన, లంబాడా పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలను ప్రోత్సహించడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, పారిశ్రామిక పథకాలపై అవగాహన కల్పిస్తారని తెలిపారు. యువతలో వ్యాపార, పారిశ్రామిక నైపుణ్యాలను పెంపొందించేలా టీఐసీసీఐ కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన నాయకులు అజ్మీర గోపాల్ నాయక్, మాజీ సర్పంచ్ రవీందర్, శంకర్ రాథోడ్ , శ్రీనివాస్ వినోద్ నాయక్, సంతోష్ నాయక్, బోజునాయక్, రాజు నాయక్, సంపత్ నాయక్, సోలో మాన్‌నాయక్, దేవేందర్ నాయక్, రాజు నాయక్, నవీన్ నాయక్, విటోబా పాల్గొన్నారు.


