గజ్వేల్‌రూరల్: హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో శనివారం నిర్వహించిన హాఫ్ మారథాన్ రన్‌లో గజ్వేల్ రన్నర్స్ పాల్గొని సత్తా చాటారు. ఎస్‌ఎంఏ(స్పైనల్ మస్క్యూలర్ ఆంట్రోపి)2026 రన్‌లో 20 మంది గజ్వేల్ రన్నర్స్ పాల్గొని ఎస్‌ఎంఏ బాధితులకు అండగా నిలిచారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో వారు మాట్లాడుతూ వ్యాయామాన్ని తమ నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు నాగమున్నెయ్యతో పాటు గజ్వేల్ రన్నర్స్ ప్రతినిధులు రమేశ్‌గౌడ్, జనార్దన్, మధుసూదన్‌రెడ్డి, లింగారెడ్డి, సత్యం, కిరణ్‌కుమార్, గోవర్ధన్‌రెడ్డి, నరేశ్‌గౌడ్, వెంకటేశ్వర్ గౌడ్, రాజు పాల్గొన్నారు.


