గణితం, సైన్స్‌పై అవగాహన | - | Sakshi
Sakshi News home page

గణితం, సైన్స్‌పై అవగాహన

Aug 10 2026 7:14 AM | Updated on Aug 10 2026 7:14 AM

గణితం, సైన్స్‌పై అవగాహన రోగులకు పండ్ల పంపిణీ బోనాలకు భారీ బందోబస్తు కేంద్రప్రభుత్వ తీరు మారాలి

పటాన్‌చెరు టౌన్‌: ఇంటర్‌ విద్యార్థులకు గణితం, విజ్ఞాన శాస్త్రాలపై అవగాహన కల్పించడంతోపాటు జేఈఈ, ఈఏపీసెట్‌ వంటి పోటీ పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం, స్కూల్‌ ఆఫ్‌ సైన్స్‌, గణిత, గణాంక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముత్తంగి డివిజన్‌ పరిధిలోని ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్జేసీ సంగారెడ్డి ఎస్‌ఓఈ బాలికల కళాశాలలకు చెందిన ఇంటర్‌ విద్యార్థులకు శనివారం ఈ కార్యక్రమం నిర్వహించారు. జేఈఈ మెయిన్‌, జేఈఈ అడ్వాన్స్‌డ్‌, ఈఏపీసెట్‌ పరీక్షలకు సన్నద్ధత వ్యూహాలు, గణితంలో సమయాన్ని ఆదా చేసే షార్ట్‌కట్స్‌, శాసీ్త్రయ సమస్యల పరిష్కార పద్ధతులు, ఉన్నత విద్య, కెరీర్‌ అవకాశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అధ్యాపకులు నరసింహస్వామి, శివారెడ్డి శేరి, తదితరులు పాల్గొన్నారు.

ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి

పటాన్‌చెరు టౌన్‌: ఎంపీ సురేశ్‌ షెట్కార్‌ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పటాన్‌చెరు పట్టణ ఆస్పత్రిలో రోగులకు, చిన్నారులకు కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి మాట్లాడుతూ..పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో, లక్షలాది మంది కార్యకర్తల ఆకాంక్షలను గౌరవిస్తూ 2023లో తనకు వచ్చిన అసెంబ్లీ టికెట్‌ ను సైతం త్యాగం చేసిన వ్యక్తి ఎంసీ సురేశ్‌ షెట్కార్‌ అని అన్నారు. కార్యక్రమంలో మాజీ పీసీసీ కార్యదర్శి మతిన్‌, పట్టణ కాంగ్రెస్‌ నాయకులు రవి, ముదిరాజ్‌ సాయిలు, కార్మిక నాయకులు రాజు, శ్రీనివాస్‌, యువజన కాంగ్రెస్‌ నాయకులు అక్షిత్‌, రమేశ్‌, ప్రవీణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

సంగారెడ్డి క్రైమ్‌: జిల్లా కేంద్రంలో ఈ నెల 9,10వ తేదీల్లో బోనాల పండుగను పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని పలు ఆలయాల వద్ద పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్యగౌడ్‌ పేర్కొన్నారు. నలుగురు సీఐలతో పాటు సుమారు 70–90 మంది పోలీస్‌ సిబ్బందిని బోనాల బందోబస్తులో నియమించినట్లు వెల్లడించారు. ముఖ్యంగా మహిళలకు ఎలాంటి ఆటంకం లేకుండా మహిళా సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. మహిళా భక్తుల విషయంలో ఆలయాల వద్ద ఉన్న సీసీ కెమెరా ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తామని వెల్లడించారు. ఆలయాల వద్ద పోలీసుల సహకారాన్ని తీసుకుని బోనాల వేడుకలను శాంతియుతంగా చేసుకున్నే విధంగా ప్రతీ ఒక్కరు సహకరించాలని కోరారు.

సీఐటీయూ జిల్లా కార్యదర్శి మల్లేశం

చిలప్‌చెడ్‌ (నర్సాపూర్‌): కార్మికులు పోరాడి సాధించుకున్న 29 రకాల కార్మిక చట్టాలను రద్దు చేసి, వారికి నష్టాన్ని కలిగించే విధంగా నాలుగు లేబర్‌ కోడ్‌లను తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వ తీరు మార్చుకోవాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి మల్లేశం డిమాండ్‌ చేశారు. మండల పరిధిలోని చిట్కుల్‌ గ్రామంలో ఈ నెల 10న జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో నిర్వహించే జైల్‌భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని శనివారం ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన ఆటో ప్రచార జాత ప్రారంభించారు. ఉపాధి హామీలో భాగంగా కేంద్రం వాటా తగ్గించి, రాష్ట్రాలకు ఎక్కువ వాటా బాధ్యతలు అప్పగించడం ఎంతవరకు సమంజమని ప్రశ్నించారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు శేఖర్‌, రాజు, శ్యామయ్య, అంజయ్య, పోచయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement