అధికారులకు సవాల్‌..! | - | Sakshi
Sakshi News home page

అధికారులకు సవాల్‌..!

Aug 6 2026 8:08 AM | Updated on Aug 6 2026 8:08 AM

హత్నూర (సంగారెడ్డి): అధికారులకు సవాలుగా...శిఖం భూముల్లో యథేచ్ఛగా వరి నాట్లు.. ఏకంగా 14 ఎకరాల్లో వరి సాగు చేస్తూ లబ్ధి పొందుతున్నారు. అయినా అధికారులు నామ్కే వాస్తేగా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ సంఘటన హత్నూర మండలం బ్రాహ్మణగూడ గ్రామ శివారులోని అయ్యవారి చెరువు శిఖంలో యథేచ్ఛగా కొనసాగుతోంది. అయ్యవారు చెరువు శిఖం 400 సర్వే నంబర్లో 62 ఎకరాల శిఖం భూమి ఉండగా 14 ఎకరాల్లో ఆరు బోర్లు వేసుకుని సొంతభూమి లాగా కబ్జాల కుసోని ప్రతీ ఏడు వరి సాగు చేస్తూ కొంతమంది లబ్ధి పొందుతున్నారు. ఫిర్యాదులు వస్తే నామ్‌ కే వస్తేగా శిఖం భూమి హద్దు బందులు హద్దు బంధువులు పాతి చేతులు దులుపుకున్నారు. ఆరు బోర్లు వేసి దర్జాగా శిఖం భూమిని అచ్చు కట్టి పొలంగా మార్చి వరి సాగు చేస్తూ ఏడాదికి రెండుసార్లు పంటలు పండిస్తూ ఉన్నప్పటికీ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 14 ఎకరాల్లో వరి సాగు తతంగం నడుస్తున్న ఇటు రెవెన్యూ అటు నీటిపారుదల శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండటంతో ఏదో ఒకటి జరిగిందన్న లోలోపల గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి శిఖం భూమిలో ఏకంగా 14 ఎకరాల వరి సాగు ఆరు బోర్లు వేసుకుని సాగుచేస్తున్న వారిపై అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని పలువురు విజ్ఞప్తి చేశారు.

హద్దులు పాతినా పట్టించుకోని వైనం

అయ్యవారి శిఖం భూమిలో 14 ఎకరాల్లో వరి సాగు

చూసీచూడనట్లు వివరిస్తున్న అధికారులు

ఇప్పటికే హద్దులు ఏర్పాటు చేశాం

అయ్యగారి చెరువు శిఖం భూమి కబ్జాకు గురికావడంతో గతంలో హద్దులు పాతి చికం భూమిలో వరి సాగు చేయవద్దని చెప్పడం జరిగింది. 14 ఎకరాల్లో ఆరు బోర్లు, వరి సాగు చేయడానికి గుర్తించామని ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. అయినా ప్రస్తుతం కూడా కొంతమంది 14 ఎకరాల్లో వరిసాగు చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని చర్యలు తీసుకుంటాం.

–శ్రీకాంత్‌ ఏఈ, నీటిపారుదల శాఖ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement